Pakను వేలెత్తి చూపడం కాదు, Kashmir గురించి ఆలోచించండి: Raut

ABN , First Publish Date - 2022-05-13T16:38:11+05:30 IST

గడిచిన ఏడేళ్లలో ఎంత మంది Kashmir Pandits కశ్మీర్‌కు తిరిగి వచ్చారో తెలియదు. హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పాక్‌పై వేలెత్తి చూపిండం ఆపేసి కశ్మీరి పండిట్ల కోసం ఏం చేయాలో చూడాలి..

Pakను వేలెత్తి చూపడం కాదు, Kashmir గురించి ఆలోచించండి: Raut

ముంబై: ప్రతి చిన్న విషయానికి Pakistan ను వేలెత్తి చూపడం కాకుండా Kashmir కు ఏదైనా చేయడం కోసం ఆలోచించాలని Shiv sena సీనియర్ నేత Sanjay Raut అన్నారు. Article 370 అనంతరం కశ్మీరీ పండిట్లు తిరిగి వస్తారని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎంత మంది తిరిగి వచ్చారో ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని ఆయన విమర్శించారు. కశ్మీర్‌లో తమకు భద్రత ఉండదని వారు భావిస్తున్నారా, ప్రభుత్వం ఎందుకు వారికి ఆ నమ్మకం కల్పించలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఒక Kashmir Pandit హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై రౌత్ శుక్రవారం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘గడిచిన ఏడేళ్లలో ఎంత మంది Kashmir Pandits కశ్మీర్‌కు తిరిగి వచ్చారో తెలియదు. హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పాక్‌పై వేలెత్తి చూపిండం ఆపేసి కశ్మీరి పండిట్ల కోసం ఏం చేయాలో చూడాలి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా వారు తిరిగి రాలేకపోతున్నారు. కశ్మీర్‌లో తమకు భద్రత లేదని ఇప్పటికీ వారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితిని మార్చడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి’’ అని రౌత్ అన్నారు.

Read more