వదలని ముసురు

ABN , First Publish Date - 2021-07-23T06:49:55+05:30 IST

జిల్లాలో గురువారం ఎడతెరిపి లేకుండా ముసురు పట్టడంతో ప లు చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. రహదా రులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజల రోజువారి పనులకు ఆటంకం కలిగింది. జిల్లాలో గురువారం ఎడతెరిపి లేకుండా ముసురు పట్టడంతో పలు చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజల రోజువారి పనులకు ఆటంకం కలిగిం

వదలని ముసురు
కొండపైన నూతన దర్శన క్యూలైన్లలోనికి చేరిన వర్షపు నీరు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 22: జిల్లాలో గురువారం ఎడతెరిపి లేకుండా ముసురు పట్టడంతో పలు చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజల రోజువారి పనులకు ఆటంకం కలిగింది. 

యాదాద్రి ఆలయానికి వరద తాకిడి

యాదాద్రి టౌన్‌: వర్షాలకు  కొండపైన, కొండకింద ఆలయ పునర్ని ర్మాణ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో పలు నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు. వర్షం తాకిడికి కొండపైన బాలాల యం ఎదుట భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన తాత్కాలిక చలువ పందిర్లు నేలకొరకగా, వాటిని దేవస్థాన అధికారులు తొలగింపజేశారు. నూతన దర్శన క్యూలైన్లు, దర్శన క్యూ కాంప్లెక్స్‌లోని చరమూర్తుల ఆలయంలోకి  వర్షపు నీరు చేరింది. అయితే చరమూర్తులు కొలువైన దర్శన కాంప్లెక్స్‌లోనికి చేరిన వర్షపు నీటిని వేకువజాము నుంచే అధికారులు తొలగింపజేసి స్వామి దర్శనాలకు విచ్చేసిన భక్తులకు  ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నూతన దర్శన క్యూ కాంప్లెక్స్‌లోకి చేరిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో అధికారులు తొలగింపజేశారు. డైన్‌ పైప్‌ లైన్‌ నిర్మాణం పూర్తయినందున  బాలాలయంలోకి వరద నీరు చేరలేదు. వర్షంతో ఘాట్‌రోడ్లు,  పట్టణ ప్రధాన రహదారులు బురదమయంగా నడవడానికి భక్తులు ఇబ్బంది పడ్డారు.

ప్రమాదం అంచున భువనగిరి పెద్ద చెరువు కట్ట

ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతు పనులు

భువనగిరి టౌన్‌: భువనగిరి పెద్దచెరువు కట్టకు మరమ్మతు  చేయించ డంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లీకేజీ రూపంలో ప్రమాదం పొంచి ఉంది.  వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువు నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నందున ఇప్పటికే బలహీనంగా ఉన్న చెరువు కట్టకు లీకేజీలు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 188 ఎక రాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు గత ఏడాది కురిసిన వర్షాలతో 12 ఏళ్ల  అనంతరం అలుగు పోసింది. గత అక్టోబరు 23న చెరువులోకి వరద  రావ డంతో లీకేజీలు ఏర్పడి చెరువు కట్ట కుంగిపోయే ప్రమాదం ఏర్పడింది.  అదే రోజు రాత్రి పలు బస్తీల్లో ప్రజలను అధికారుల  పునరావాస కేంద్రా లకు తరలించారు.  ఆ రోజు అర్ధరాత్రి చెరువు కట్టను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి చెరు వుకు ఇరువైపులా ఉన్న రెండు కత్వాల ఎత్తును అప్పటికప్పుడే తవ్వించి  చెరువు కట్ట లీకేజీలకు తాత్కాలికంగా మరమ్మత్తు చేయించారు.  1.25 కిలోమీటర్ల చెరువు కట్టకు లోపలి భాగంగా మూడు మీటర్ల వెడల్పుతో 800 మీటర్ల దూరం రూ.2కోట్ల వ్యయంతో మరమ్మతు చేయించాలని అధి కారులు ప్రతిపాదనలు రూపొందించి ఇరిగేషన్‌ శాఖకు నివేదిక పంపారు.  చెరువు కట్ట దిగువ భాగంలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌, గేట్‌ వాల్వ్‌ కూడా చెరువుకట్ట బలహీన పడటానికి పరోక్ష కారణమని అధికారులు అంచనా వేశారు.  ఈ మేరకు ఆ పైపులైన్‌ తరలించాలని మిషన్‌ భగీరథ శాఖకు లేఖ రాసినా స్పందనలేదని  ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. చెరువుకట్టకు  ప్రభుత్వం మరమ్మతు చేయించి  తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

లక్కారం చెరువు ఫీడర్‌ చానెల్‌ మూసివేత

మూసీలోకి వరద నీటి మళ్లింపు 


 చౌటుప్పల్‌ టౌన్‌ : పట్టణంలోని ఊర చెరువులోకి వరద రాకుండా  ఎగువ బాగంలోని  లక్కారం చెరువు పీడర్‌ చానెల్‌ను అధికారులు  గురువారం సాయంత్రం మూసివేయించారు.  ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మండల పరిధిలోని   దండు మల్కాపురం చెరువు దిగువ భాగంలో లక్కారం చెరువు ఫీడర్‌ చానెల్‌కు అడ్డుకట్ట వేసి వరద నీటిని చిన మూసీ నదిలోకి మళ్లించారు. ఈ ఫీడర్‌ చానెల్‌  నీటితో లక్కారం చెరువు ఇప్పటికే 90 శాతం నిండిందని లక్కారం గ్రామానికి చెందిన  రైతులు కాసర్ల శ్రీనివాస్‌ రెడ్డి, ఆకుల ఇంద్రసేనారెడ్డిలు తెలిపారు. చౌటుప్పల్‌లోని ఊర చెరువు అలుగు నీరు దిగువకు వెళ్లకుంటే ప్రమా దం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన  చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు  మునిసిపల్‌ సిబ్బందిని గురువారం రెండు ప్రాంతాల్లో కాలువలు ఏర్పాటు చేయించారు. అలుగునీటిని జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డులోని మురుగు కాల్వలోకి పంపే ఏర్పాట్లు చేయించారు. అలుగునీటిని మునిసి పల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, మునిసి పల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం గౌడ్‌, కమిషనర్‌ కె.నర్సింహారెడ్డిలు పరిశీలించారు.  

16 ఏళ్లలో మూడవ సారి అలుగు పోస్తున్న చౌటుప్పల్‌ చెరువు

 చౌటుప్పల్‌ పట్టణంలోని ఊర చెరువు చెరువు నిండి అలుగుపోస్తోంది.  16 ఏళ్లలో ఈ చెరువు అలుపోయడం ఇది మూడో సారి మాత్రమే.  2005  సంవత్సరంలో, గత ఏడాది అక్టోబరు చెరువు అలుగుపోసింది. 10 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువు అలుగుపోస్తోంది.  







Updated Date - 2021-07-23T06:49:55+05:30 IST