పాఠశాలను అనుసంధానం చేయవద్దు

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

ఉన్న పాఠశాలను మరో పాఠశాలలో అనుసంధానం చేయరాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధ వారం రెండు గంటలు పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేప ట్టారు.

పాఠశాలను అనుసంధానం చేయవద్దు
పిట్టావాండ్లపల్లె పాఠశాల వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

నిమ్మనపల్లె, జూలై 6: ఉన్న పాఠశాలను మరో పాఠశాలలో అనుసంధానం చేయరాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధ వారం రెండు గంటలు పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేప ట్టారు.  మండలంలోని పిట్లా వాండ్లపల్లెలో ప్రాథమికోన్నత పాఠ శాలలో చదివే విద్యార్థులు ఒక కిలో మీటర్‌ పరిధిలో వుండ డంతో ప్రభుత్వం అను సంధానం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇదే పాఠశాలలో పుం డాలంటూ పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయులను బయటకు పంపివేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా  విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంత కాలం 1నుంచి 8వతరగతి వరకు వుండేదని ఇప్పుడు కొత్తగా 1కిలో మీటరు పరిధిలోని పిల్లలంతా మరో పాఠశాలకు వెళ్ల మనడం సమం జసం కాదన్నారు. 3వ తరగతి చదివే పిల్లలు కాలినడన ఎలా వెళతారని ప్రశ్నించారు.  పిల్లలకు టీసీ ఇవ్వరాదని అదే జరిగితే పిల్లలను ఇళ్ల వద్దే వుంచుకొంటామని తెలిపారు.  అనంతరం పోలీసులు, సర్పంచ్‌ అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.    


Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST