సాకులు చెప్పొద్దు.. పనిచేసి చూపించండి

ABN , First Publish Date - 2021-11-26T05:25:15+05:30 IST

అడిగిన దా నిపై సూటిగా సమాధానం చెప్పకుండా ప్రతి విషయానికి సాకులు చెప్పడం సరికాదని, పనిచేసి చూపించాలని కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాకులు చెప్పొద్దు.. పనిచేసి చూపించండి
చాపలమడుగులో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌


అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం  

పుల్లలచెరువు, నవంబరు 25: అడిగిన దా నిపై సూటిగా సమాధానం చెప్పకుండా ప్రతి విషయానికి సాకులు చెప్పడం సరికాదని, పనిచేసి చూపించాలని కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై పుల్లలచెరువు మండ లం చాపలమడుగు గ్రామంలో లబ్ధిదారులతో గురువారం కలెక్టర్‌ మాట్లాడారు. అనంతరం సచివాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడు తూ పుల్లలచెరువు మండలంలో ఓటీఎస్‌ లబ్ధిదారుల సర్వేలు 2 వేలు వరకూ పెండింగ్‌ ఉం డడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్‌ను వేగవం తం చేసి ప్రజాప్రతినిధుల సహ కారంతో  రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. సచివాయలంలో అన్ని ప్రభుత్వ సేవలు అందుతున్నాయని సిబ్బంది తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు బయోమెట్రిక్‌ వేయాలన్నారు. 

 చాపలమడుగు సర్పంచి టి.సత్యనారాయణరెడ్డి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజలు చాపలమడుగు, కవలకుంట్ల గ్రామాల చెరువులు అక్రమణలకు గుర య్యాయని, ముటుకుల ప్రాజె క్టు నుంచి నీళ్లు రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకోచ్చారు. ఈ విషయంపై అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీడీవో సాయికుమార్‌, తహసీ ల్దార్‌ కె.దాసు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీ ఈ రామకృష్ణ, ఇన్‌చార్జి ఎంపీడీవో రాజ్యలక్ష్మి, హౌ సింగ్‌ ఏఈ శ్రీనివాసరావు, ఏవో సుధీర్‌, ఎంపీఎం వెంకటయ్య, పం చాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపా లెం: ఓటీఎస్‌ తో సంపూర్ణ గృహ హక్కు లభిస్తుందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని వీరభద్రాపురం సచివాలయాన్ని కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటీఎస్‌పై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.  అ నంతరం పది మందికి ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్‌ పంపిణీ చేశారు. వీరభద్రాపురం గ్రామంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులతో కలసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ వీ వీరయ్య, డీఎల్‌డీవో సాయికుమార్‌, ఎపీఎం రవీంద్ర, సర్పంచి   ఆశీర్వాదం, ఎంపీటీసీ శేషు, వెంకటనారాయణ,  వీఆర్వో షేక్‌ నాసర్‌వలి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : వన్‌టైం సెటిల్‌మెం ట్‌(ఓటీఎస్‌) లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలె క్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చా రు. గురువారం మండలంలోని రాజుపాలెం గ్రామ సచివాలయాన్ని  కలెక్టర్‌  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఓటీఎస్‌పై సమీక్షించారు. జిల్లాలో 2.85 లక్షల మం ది లబ్ధిదారులు ఓటీఎస్‌లో ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. రోజుకు 800  నుంచి వెయ్యి మంది వరకు లబ్ధి పొందుతున్నారని అన్నారు. జిల్లాకు రోజుకు 300 వరకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దానికి అనుగుణంగా మండలాల్లో ఓటీఎస్‌ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం గురువారం 50 శాతం లక్ష్యం నెరవేరిందని, రానున్న రోజుల్లో మండల, క్షేత్ర స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని వంద శాతం లక్ష్యం సాధిస్తామన్నారు. 

శనివారం జిల్లాలో 30 వేల మంది లక్ష్యంగా ఓటీఎస్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.  సో మేపల్లి గ్రామానికి రోడ్డు వసతి సక్రమంగా లేదని, రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు  కల్టెరుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.కిరణ్‌, ఎంపీడీవో సుదర్శనం, గృహ నిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఎంపీపీ కె.సుబ్బారెడ్డి, సర్పంచ్‌ బి.కృపావతి, ఎంపీటీసీ జ్యోతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T05:25:15+05:30 IST