ఈ పొరపాట్లు చేయొద్దు..!

ABN , First Publish Date - 2021-03-20T05:30:00+05:30 IST

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్లు వాడడం తప్పనిసరి. వీటివల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి పోతుంది. చర్మం జిడ్డుగా ఉండదు. అయితే ఆల్కహాల్‌ లేని నేచురల్‌ టోనర్లను ఉపయోగించాలి

ఈ పొరపాట్లు చేయొద్దు..!

  • చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్లు వాడడం తప్పనిసరి. వీటివల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి  పోతుంది. చర్మం జిడ్డుగా ఉండదు. అయితే ఆల్కహాల్‌ లేని నేచురల్‌ టోనర్లను ఉపయోగించాలి. 
  • ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ పూసుకోవాలి. 
  • చాలామంది ఎప్పుడూ ఒకేరకమైన సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ చర్మం స్వభావానికి  తగిన బ్యూటీ ఉత్పత్తులను ఎంచుకోవాలి.
  • వేసవిలో నీళ్లు బాగా తాగడం వల్ల తగినంత తేమ అంది చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది.
  • చాలినంత నిద్ర లేకపోతే స్ట్రెస్‌ హార్మోన్లు విడుదలై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. అందుచేత కంటినిండా నిద్ర తప్పనిసరి.
  • చర్మంపై ముడతలు కనిపించిన వెంటనే యాంటీ ఏజింగ్‌ ఉత్పత్తులను వాడేస్తుంటారు. అనవసరంగా బ్యూటీ ఉత్పత్తులను వాడడం చర్మానికి హాని చేస్తుంది.  
  • ఉన్నట్టుండి డైట్‌ మార్చడం, రాత్రుళ్లు చర్మానికి క్రీము రాసుకోకపోవడం, మొటిమలు వస్తే ఆ ప్రదేశాన్ని తరచూ తాకుతుండడం, బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో తొలగించాలని ప్రయత్నించడం వంటివి చేయడం వల్ల చర్మ కణాలు, వాటి స్వరూపం దెబ్బతింటుంది.

Updated Date - 2021-03-20T05:30:00+05:30 IST