Homemade Baby Food: పిల్లల ఆహారంలో తేనె కలవనీయకండి.. ప్రమాదం సుమా..!

ABN , First Publish Date - 2022-10-06T19:21:57+05:30 IST

తల్లిపాలు ఆరు నెలల వయస్సు వరకు చాలా ముఖ్యమైన ఆహారంగా బిడ్డకు ఇవ్వాలి.. పాలు సరిపడనంత ఉంటే ఒక సంవత్సరం వయస్సు వరకు ఇవ్వడం మంచిది.

Homemade Baby Food: పిల్లల ఆహారంలో తేనె కలవనీయకండి.. ప్రమాదం సుమా..!

తల్లిపాలు ఆరు నెలల వయస్సు వరకు చాలా ముఖ్యమైన ఆహారంగా బిడ్డకు ఇవ్వాలి.. పాలు సరిపడనంత ఉంటే ఒక సంవత్సరం వయస్సు వరకు ఇవ్వడం మంచిది. ఆ తరువాత బిడ్డకు ఘన పదార్ధాలను ఇవ్వడం ప్రారంభించడానికి సరైన సమయాన్ని వైద్యుల సలహాతో మొదలు పెట్టండి. ఈ ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి కీలకమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. 


బిడ్డ ఘన పదార్ధాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నతరువాత ఐరన్, ఫోర్టిఫైడ్, తృణధాన్యాలు వంటి అనేక పోశకాలతో నిండిన ఆహారాన్ని ఇవ్వాలి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు కలగలిపి ఇవ్వడం మంచిది. ఎటువంటి ప్యాకింగ్ ఆహారాన్ని ఇవ్వకుండా ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేసుకోవడం మంచిది.


మొదలు పెడుతున్నప్పుడు..

బేబీకి ఫుడ్ మొదలు పెడుతున్నప్పుడు ఇంట్లోనే తయారు చేసిన వాటితో మొదలు పెట్టడం మంచిది. బాగా పండిన అవోకాడో, అరటిపండును గుజ్జు చేసి ఇవ్వడం, పిల్లలు ఈ ఆహారానికి అలవాటు పడిన తరువాత బీట్ రూట్ , బ్రోకలీ, టర్నిప్ లు , అస్పరాగస్, బచ్చలి కూర, బ్లూబెర్రీస్, కాలే, మామిడి, బొప్పాయి వంటి వాటికి బేబీకి ఆహారంగా ఇవ్వవచ్చు.


సీజన్ లలో ఉండే పదార్ధాలతో పిల్లలకు అలవాటు చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆహారాన్ని అందించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆహారం చాలా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.


12 నెలల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు ఆహారంలో, పానియాలలో తేనెను కలిపి ఇవ్వకూడదు. ఎందుకంటే అందులోని క్లోస్ట్రిడియం బోటులినమ్ స్పోర్స్ ఉంటుంది. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాను చంపేస్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. 


బయటి ఉష్ణోగ్రతలకు తగినట్టు ఆహారాన్ని ఇవ్వాలి. లేదంటే బిడ్డను ఇవి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రమాదం ఉంది. మొదటి సంవత్సరం లోని పిల్లలకు ఆవు పాలను ఇవ్వకూడదు. గుడ్లు, మాంసాలు వంటివి పెద్దయ్యాకా పెట్టినా బాగా ఉడికిన తరువాత మాత్రమే ఇవ్వాలి. ఉప్పు తక్కువగా ఇవ్వాలి. మసాలాలు పెరిగేవరకూ బిడ్డకు ఇవ్వకపోవడమే మంచిది. 

Updated Date - 2022-10-06T19:21:57+05:30 IST