కరోనాపై నిర్లక్ష్యం వద్దు..

ABN , First Publish Date - 2021-04-17T06:02:12+05:30 IST

కరోనాపై నిర్లక్ష్యంగా వ్య వహరించవద్దని లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చే యించుకోవాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ సూ చించారు.

కరోనాపై నిర్లక్ష్యం వద్దు..
ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

- లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోండి.. 

- కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను అందించండి

- ‘ఖని’ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 16: కరోనాపై నిర్లక్ష్యంగా వ్య వహరించవద్దని లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చే యించుకోవాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ సూ చించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి ని సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల రెం డవ అంతస్థు నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, ఆగస్టు వరకు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య అధికారులతో కొవిడ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని, ప్రమాదకరంగా ఉన్నవారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. పరీక్షల సం ఖ్య పెంచాలని, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల లో ప్రజలు అందుబాటులో వ్యాక్సిన్‌ ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయరాదని, దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం వచ్చినా, వాంతులు, విరేచనాలు అయితే ఎండదెబ్బగా భావించవద్దని, కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని, 45సంవత్సరాలు దాటినవారు తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని, వ్యాక్సిన్‌ పట్ల అపోహలు వద్దన్నారు. గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ప్రస్తు తం 30పడకల ఐసోలేషన్‌ ఉందని, మరో 20పడకల కు ఆక్సిజన్‌ లైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. సుల్తానాబాద్‌, సింగరేణి ఏరియా ఆసుపత్రిల్లో ఐసోలేషన్‌ సెంటర్లు ఉన్నాయని, పెద్దపల్లి బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఐసోలేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారిని ఆ ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్సను అందించనున్నట్టు, దీని కోసం సమీక్ష సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. ప్రస్తుతానికి జిల్లాలో 72వెంటిలేటర్లు ఉన్నా యని, వాటి సంఖ్యను కూడా పెంచనున్నట్టు చెప్పా రు. కరోనా సోకిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, స్వీయనియంత్రణ పాటించాలని కలెక్టర్‌ సూ చించారు. ఆమె వెంట రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌, డీసీహెచ్‌ వాసుదేవరెడ్డి, గోదావరిఖని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎం భీష్మ, వైద్యులు ఉన్నారు.

Updated Date - 2021-04-17T06:02:12+05:30 IST