యువత కరోనాపై నిర్లక్ష్యం వహించవద్దు : భగత

ABN , First Publish Date - 2021-05-10T06:52:27+05:30 IST

యువత కరోనాపై నిర్లక్ష్యం వహించవద్దని సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత అన్నారు.

యువత కరోనాపై నిర్లక్ష్యం వహించవద్దు : భగత
ఏరియా ఆసుపత్రి డాక్టర్లతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే భగత

నాగార్జునసాగర్‌, మే 9 : యువత కరోనాపై నిర్లక్ష్యం వహించవద్దని సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. ఆదివారం ఆయన సాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించి  కరోనా ర్యాపిడ్‌ టెస్టుల గురించి, కరోనా ఐసోలేషన వార్డులో రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఇంకా కావల్సిన సౌకర్యాలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన ంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా రెండోదశలో ఎక్కువగా యువత మరణిస్తున్నారని, దీనికి యువత కరోనాపై, తమ ఆరోగ్య ంపై నిర్లక్ష్యం వహించడమే కారణమన్నారు. ఒక వ్యక్తికి జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభు త్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు.  కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తికి శ్వాస సమస్యలు ఉంటే రక్తంలో చేసే ఐదు రకాల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలన్నారు. కరోనా వచ్చిన వ్యక్తికి ధైర్యమే శ్రీరామ రక్ష అని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఎంవో భాను ప్రసాద్‌ నాయక్‌, డాక్టర్లు చక్రవర్తి, అమృతనాయక్‌, హరికృష్ణ, నందికొండ మునిసిపల్‌ వైస్‌ చైర్మన మందకుమార్‌ రఘువీర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కర్ణ బ్రహ్మరెడ్డి, విక్రం, మోహననాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-10T06:52:27+05:30 IST