ఓటీఎ్‌సకు డబ్బు చెల్లించవద్దు: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-08T05:41:41+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని, ఎవరూ డబ్బులు చెల్లించవద్దని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు.

ఓటీఎ్‌సకు డబ్బు చెల్లించవద్దు: టీడీపీ
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షీనాయుడు

ఆదోని రూరల్‌, డిసెంబరు 7:  ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని, ఎవరూ డబ్బులు చెల్లించవద్దని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు  అన్నారు.  మంగళవారం ఆయన గౌరవసభ కార్యక్రమంలో భాగంగా దిబ్బనకల్లు గ్రామంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలలోపే ఓటీఎ్‌సను రద్దు చేసి గృహ లబ్ధిదారులు అందరికి ఉచితంగా రిజిస్ట్రేషన చేయిస్తామని   భరోసా ఇచ్చారు.  నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో కలియతిరిగి గృహ లబ్ధిదారులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మమ్మ, సర్పంచ లక్ష్మి పాల్గొన్నారు. 

కోసిగి, డిసెంబరు 7: ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని టీడీపీ కోసిగి మండల సీనియర్‌ నాయకుడు పెండ్యాల ఆదినారాయణశెట్టి, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి ప్రజలకు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లను రిజిస్ర్టేషన చేయిస్తుందని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలియజేశారని పేర్కొన్నారు. ప్రజలెవరూ ఇళ్ల రిజిస్ర్టేషన కోసం రూ.10 వేలు చెల్లించవద్దని కోరారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు బెదిరిస్తే తమ దృష్టికి తేవాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతలగేని నరసారెడ్డి, రణ తిక్కన్న, పులుసు శివన్న, బుల్లి నర్సప్ప, బుల్లి రామయ్య, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ హయంలోనే అభివృద్ధి

నందవరం, డిసెంబరు 7: టీడీపీ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని ఇబ్రహీంపురం మాజీ సర్పంచ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. టీడీపీ గ్రామ కమిటీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా గ్రామంలో పిడికెడు మట్టి కూడా వేయలేదని అన్నారు. బీవీ హయంలో జీఆర్‌పీ నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందించారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక జీఆర్‌పీ మోటార్లకు కవచం కూడా చేయించలేదని విమర్శించారు. రైతులు మోటర్‌ దగ్గరుకు వెళ్లినప్పు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మారెప్ప, శంకరమ్మ, నరసింహులు, బజారి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:41:41+05:30 IST