టెస్టుల సంఖ్య తగ్గొద్దు

Published: Wed, 19 Jan 2022 01:10:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టెస్టుల సంఖ్య తగ్గొద్దు

  • వైరస్‌ వ్యాప్తి అంచనాకు పరీక్షలు కీలకం
  • తక్షణం పెంపుదల మీద దృష్టిసారించండి
  • రాష్ట్రాలు/యూటీలకు కేంద్ర ప్రభుత్వం లేఖ
  • దేశంలో కొత్తగా 2.38 లక్షల కొవిడ్‌ కేసులు
  • బస్తర్‌లో 200 మందిపైగా భద్రతా సిబ్బందికి..
  • మాండ్యలో వందమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకూ

 

న్యూఢిల్లీ, జనవరి 18: ఒమైక్రాన్‌ వ్యాప్తి విస్తృతం గా ఉన్న సమయంలో పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, మహమ్మారి కట్టడిలో ఇది చాలా కీలకమని పేర్కొంది. తద్వారా క్లస్టర్‌/హాట్‌ స్పాట్‌ల గుర్తింపునకు, కట్టడి ప్రాంతంగా ప్రకటించేందుకు, కాంటాక్టు ట్రేసింగ్‌, క్వారంటైన్‌, ఐసొలేషన్‌ తదితర కట్టడి చర్య లు తీసుకునేందుకు వీలుంటుందని రాష్ట్రాలు/యూటీలకు రాసిన లేఖలో కేంద్రం తెలిపింది. 


17 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో సోమవారం 2.38 లక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే యాక్టివ్‌ కే సులు 80 వేలు పెరిగి.. 17.36 లక్షలకు చేరాయి. పా జిటివ్‌ రేటు 14.43కు పెరిగింది. గత రెండు వారాల్లో ఛత్తీ్‌సగఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌ సహా 4 జిల్లాల్లో 200 మంది పైగా భద్రతా సిబ్బందికి వైర్‌సకు గురయ్యారు. వీరంతా టీకా 2 డోసులు పొందినవారేనని అధికారులు తెలిపారు. కర్ణాటక మాండ్యలోని పీఈఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 107 మంది విద్యార్థులు సహా 125 మందికి కరోనా సోకింది. కాగా, దేశంలో కొవిడ్‌ టీకా తీసుకున్నవారి సంఖ్య 158 కోట్లు దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒమైక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు.


ముంబై, ఢిల్లీ లో వేవ్‌ ఇప్పటికే గరిష్ఠానికి చేరిందని దీనిప్రకారం మార్చి నాటికి దేశంలో తగ్గుముఖం పడుతుందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఓం శ్రీవాస్తవ తెలిపారు. మార్చి-ఏప్రిల్‌లో మరో ఆందోళనకారక వేరియంట్‌ ఉద్భవించకుంటే కరోనా వెనకడుగు ఖాయమని మహారాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి తెలిపారు. కాగా, ముంబైలో థర్డ్‌ వేవ్‌ లో తొలిసారిగా బ్లాక్‌ ఫంగ్‌సతో ఓ రోగి మృతి చెం దాడు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కొవిడ్‌ కేసులు కొంతమేర తగ్గాయి. ఒమైక్రాన్‌ వ్యాప్తి తగ్గడం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కొవిడ్‌ పరీక్షలను తగ్గించడం వల్లే కేసులు కొంతమేర తగ్గాయన్నారు. ‘టెస్ట్‌, ట్రేస్‌, ఐసొలేట్‌, ట్రీట్‌’(టీటీఐటీ) వ్యూహాన్ని మళ్లీ భారత్‌ అనుసరించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్‌ మాజీ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.మెహ్రా సూచించారు.  బుర్జ్‌ ఖలీఫాను మించి ‘డోలో’ అమ్మకాలు!

కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తర్వాత ‘డోలో 650’ మా త్రల అమ్మకాలు అమాంతం పెరిగాయి. 2020 నుంచి ఇప్పటివరకు 350 కోట్లకుపైగా డోలో మాత్రల విక్రయాలు జరిగాయి. ఈ మాత్రలన్నింటిని ఒకదానిపై ఒకటిగా పేర్చితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం ‘బుర్జ్‌ ఖలీఫా’ కంటే 63,000 రెట్లు పొడవుగా ఏర్పడుతుంది. గత రెండేళ్లలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన జ్వర మాత్రల జాబితాలో డోలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కాల్‌పాల్‌ మాత్రలు ఉండగా, ఆరో స్థానంలో క్రోసిన్‌ ట్యాబ్లెట్లు ఉన్నాయి. కాగా, తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన పలువురు రోగుల్లో ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌) రుగ్మత తలెత్తుతోంది. అలాంటి వారి చికిత్సకు పనికొస్తుందని భావిస్తున్న ‘స్టెమ్‌ ప్యూసెల్‌’ ఔషధంతో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు కర్ణాటకకు చెందిన ‘స్టెమ్‌ ప్యూటిక్స్‌’ కంపెనీకి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. 


10 రోజుల తర్వాతా పాజిటివ్‌

కొవిడ్‌ సోకి ఐసొలేషన్‌లో ఉన్న కొంత మందిలో 10 రోజుల తర్వాత కూడా పాజిటివ్‌ వస్తోందని ఓ పరిశోధనలో తేలింది. ప్రతి పది మందిలో ఒకరికి ఇలా ఉండే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ఎక్సిటర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధన ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో సరికొత్త టెస్టు ద్వారా పాజిటివ్‌లలో వైరస్‌ ఉనికిని గుర్తించారు. మూకుమ్మడి ఆంక్షలతో నష్టమే ఎక్కువ: డబ్ల్యూహెచ్‌వో 

కోల్‌కతా, జనవరి 18 : భారత్‌లాంటి పెద్ద దేశంలో కరోనా కట్టడికి జనసంచారం, ప్రయాణాలపై మూకుమ్మడి ఆంక్షలు విధించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి రొడెరికో హెచ్‌.ఓఫ్రిన్‌ పేర్కొన్నారు. రిస్క్‌ ఆధారిత కరోనా కట్టడి ప్రణాళికతో భారత్‌ ముందుకు పోవడం మంచిదని సూచించారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధులను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.