నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించొద్దు

ABN , First Publish Date - 2021-04-21T04:58:36+05:30 IST

కరోనా నేపథ్యంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తప్పవని సాలూరు తహసీల్దార్‌ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు.

నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించొద్దు
సాలూరులో వ్యాపారులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌

 వ్యాపారులకు అధికారుల ఆదేశం

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా  నేపథ్యంలో నిత్యావసర  సరుకులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తప్పవని సాలూరు తహసీల్దార్‌ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.  ఎవరైనా అధిక ధరలకు విక్రయించినట్టు తమ దృష్టికి వస్తే చర్యలకు వెనుకాడబోమన్నారు. కరోనా కష్టకాలం కావడంతో వ్యాపారులు సైతం మానవతా దృక్పథంతో విక్రయాలు చేయాలన్నారు.  ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కు పెట్టుకున్న వినియోగదారులకే సరుకులు ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఎస్‌డీటీ చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.    కొత్తవలస: నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారం పెంచి విక్రయిస్తే చర్యలు తప్పవనితహసీల్దార్‌ రమణారావు తెలి పారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వర్తక సంఘం ప్రతినిధులతో మాట్లాడారు.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో   మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే అనుమానాలతో నిత్యావసరాలకు డిమాండ్‌ పెరుగు తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా విక్రయించడానికి వీలు లేదన్నారు. దుకాణాలవద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తేనే సరుకులు విక్రయించాలని సూచిం చారు. సమావేశంలో వర్తక సంఘం ప్రతినిధులు ద్వారపూడి అర్జునరావు, ముర్కూరి సన్యాసిరావు(తాత) తదితరులు పాల్గొన్నారు.  మెరకముడిదాం   కరోనా  నేపథ్యంలో నిత్యావసరాలను  అధిక ధరలకు విక్రయిస్తే  వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని సీఎస్‌డీటీ పి.రామారావు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించి జేసీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  

 

Updated Date - 2021-04-21T04:58:36+05:30 IST