మందుబాబులకు శానిటైజర్లు విక్రయించవద్దు

ABN , First Publish Date - 2020-08-07T10:36:22+05:30 IST

మందుబాబులకు శానిటైజర్లు విక్రయించవద్దని ఎక్స్‌జ్‌ సీఐ బాలనర్సిహ కోరారు.

మందుబాబులకు శానిటైజర్లు విక్రయించవద్దు

సాలూరు: మందుబాబులకు శానిటైజర్లు విక్రయించవద్దని ఎక్స్‌జ్‌ సీఐ బాలనర్సిహ కోరారు. పట ్టణంలో పలు మెడికల్‌ షాపులను ఆయన అధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. షాపుల నిర్వాహ కులతో   మాట్లాడారు. ఎవరికిపడితే వారికి శానిటైజ ర్లు అమ్మవద్దని కోరారు.  శానిటైజర్లు కొనుగోలుచేసే వారి పేర్లు, వారి వివరాలు ఫోన్‌ నెంబర్లు విధిగా నోట్‌ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో బొబ్బిలి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు, ప ట్టణ ఎస్సై ఫకృద్దీన్‌ పాల్గొన్నారు.


భోగాపురం: భోగాపురం, పూసపాటిరేగ మం డలాలల్లో  గురువారం   మెడికల్‌ షాపులను పరిశీలించారు. శాని టైజర్లు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. కల్తీవి, అనుమతులు లేని వి విక్రయిస్తున్నారా అన్న అంశాలపై తనిఖీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో  ఎక్సైజ్‌ సీఐ వెంకటరావు,  ఎస్‌ఐలు యు. మహేష్‌, బాలాజీరావు, ఎఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.


నెల్లిమర్ల: హ్యాండ్‌ శానిటైజర్‌ తాగి మరణిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటుడంతో జిల్లాలోని ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు ఆదేశాల మేరకు నెల్లిమర్ల ఎస్‌ఇబీ ఎస్‌ఐ నరేంద్రకుమార్‌, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్‌ మండల కేంద్రంలోని అన్ని మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  శానిటైజర్‌ తాగడం ప్రాణానికి హానికరమంటూ బోర్డులను వేలాడదీయాలని సూచించారు. 

Updated Date - 2020-08-07T10:36:22+05:30 IST