చాణక్య నీతి: స్త్రీల విషయంలో వీటిని విస్మరిస్తే.. సమాజం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది...

ABN , First Publish Date - 2022-07-17T12:32:15+05:30 IST

ఆచార్య చాణక్య సమాజంలో స్త్రీల పాత్ర కీలకమని చెప్పారు.

చాణక్య నీతి: స్త్రీల విషయంలో వీటిని విస్మరిస్తే.. సమాజం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది...

ఆచార్య చాణక్య సమాజంలో స్త్రీల పాత్ర కీలకమని చెప్పారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మహిళలది ప్రధాన పాత్ర అని తెలిపారు. పురుషుల మాదిరిగానే స్త్రీల విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని ఆచార్య విశ్వసించారు. విద్యావంతులైన మహిళలు వంశానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తారని ఆచార్య తెలిపారు. కుటుంబ పురోభివృద్ధి కోసం కచ్చితంగా మహిళలకు చదువు నేర్పించాలని చాణక్య సూచించారు. శాస్త్రాలలో స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారని ఆచార్య తెలిపారు. 


అందుకే వారిని ఎప్పుడూ గౌరవించాలి. స్త్రీలు సంతోషంగా లేని కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో, సమాజంలో స్త్రీల ప్రతిభ వెలుగులోకి రావాలి. ఇది మెరుగైన సమాజానికి సహకారం అందిస్తుంది. స్త్రీల సహకారంతోనే పురుషునికి తన జీవితంలోని ఏ లక్ష్యమైనా నెరవేరుతుందని ఆచార్య తెలిపారు. స్త్రీలను విస్మరించిన సమాజం ఎన్నటికీ పురోగమించదు. ఇంటిలోని మహిళలకు తగిన గౌరవం ఇవ్వకపోతే కుటుంబమంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు. 

Updated Date - 2022-07-17T12:32:15+05:30 IST