అనవసరంగా బయట తిరగరాదు

ABN , First Publish Date - 2021-05-11T04:43:47+05:30 IST

కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయట తిరగరాదని మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ హెచ్చరించింది.

అనవసరంగా బయట తిరగరాదు
సమావేశంలో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ మధుసూదన్‌రెడ్డి

పులివెందుల టౌన్‌, మే 10: కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయట తిరగరాదని మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ హెచ్చరించింది. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ మండల కమిటీ అధికారులు తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి ఇతర అధికారులు సమావేశమయ్యారు. కొవిడ్‌ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు. అంగళ్ల వద్ద గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కొవిడ్‌ రూల్స్‌ పా టించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులు బయట తిరుగుతుంటే అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-05-11T04:43:47+05:30 IST