ఇళ్లకు వాడే సిలిండర్లు షాపుల్లో వద్దు

ABN , First Publish Date - 2020-12-03T05:10:44+05:30 IST

గిరిజన సహకార సంస్థ పరిధిలో అందిస్తున్న ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్లను ఇంటికి మాత్రమే వాడాలని, షాపులకు, హోటళ్లకు వాడకూడదని, ఒకవేళ వాడాలనుకుంటే 19 కేజీల గ్యాస్‌ సిలిండర్లను మాత్రమే వాడాలని గుమ్మలక్ష్మీపురం జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ బి.కృష్ణ అన్నారు.

ఇళ్లకు వాడే సిలిండర్లు షాపుల్లో వద్దు

జీసీసీ మేనేజర్‌ కృష్ణ

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 2: గిరిజన సహకార సంస్థ పరిధిలో అందిస్తున్న ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్లను ఇంటికి మాత్రమే వాడాలని, షాపులకు, హోటళ్లకు వాడకూడదని, ఒకవేళ వాడాలనుకుంటే 19 కేజీల గ్యాస్‌ సిలిండర్లను మాత్రమే వాడాలని గుమ్మలక్ష్మీపురం జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ బి.కృష్ణ అన్నారు. బుధవారం ఆయన జీసీసీ సేల్స్‌మెన్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గిరిజన సహకార సంస్థ పరిధిలో అందిస్తున్న ఇండియన్‌ గ్యాస్‌ డొమెస్టిక్‌ సిలిండర్లను హోటళ్లకు, దుకాణాలకు వాడుతున్నారని, ఇలా వాడకూడదన్నారు. ఇళ్లకు వాడే సిలెండర్లను కమర్షియల్‌ ప్రాతిపదికన వాడితే చట్టరిత్యా నేరమని, అటువంటి వారికి చట్ట ప్రకారం శిక్షించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు హోటల్‌ యజమానులు, దుకాణ యజమానులు గ్రహించాలని అన్నారు. జీసీసీ అకౌంటెంట్‌ ఎస్‌.రాము, సేల్స్‌మెన్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:10:44+05:30 IST