కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించొద్దు

ABN , First Publish Date - 2021-06-17T04:50:07+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్టీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించొద్దు
ఎచ్చెర్ల: కర్ఫ్యూ తీరును పరిశీలిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు

ఎచ్చెర్ల: కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్టీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. కుశాలపురం పంచాయతీ బైపాస్‌ జంక్షన్‌ వద్ద బుధవారం పోలీసు చెక్‌  పాయింట్‌ను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రోడ్లపై తిరగరాదన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.రాజేష్‌ పాల్గొన్నారు. ఫపాలకొండ: కరోనా ఉధృతంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డీఎస్పీ ఎం.శ్రావణి కోరారు. బుధవారం నగర పంచాయ తీలోని ఏలాం జంక్షన్‌,  ఎన్‌కేరాజపురం కూడళ్లలో  వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో సీఐ శంకరరావు పాల్గొన్నారు. ఫ భామిని:బత్తిలి, కాట్రగడ, బిల్లుమడ, నులకజోడులో హోళీ క్రాస్‌  డైరెక్టర్‌ ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో సంస్థ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ను అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలని బుధవారం అవగాహన కల్పించారు.





 

Updated Date - 2021-06-17T04:50:07+05:30 IST