కులాలవారీగా కూలీల వేతనాల చెల్లింపు వద్దు

ABN , First Publish Date - 2021-07-27T05:47:26+05:30 IST

ఉపాధిహామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇవ్వాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయనాయుడు డిమాండ్‌ చేశారు.

కులాలవారీగా కూలీల వేతనాల చెల్లింపు వద్దు
అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

 సూర్యాపేట (కలెక్టరేట్‌), జూలై 26: ఉపాధిహామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇవ్వాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయనాయుడు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వ హించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల న్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతువ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుండగా, ఉపాధి కూలీలకు కులాల పేరుతో వేతనాలు చెల్లించడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, పున్నయ్య, దంతాల రాంబాబు, గాలి కృష్ణ, శ్రీను, వెంకట్‌, మల్లీశ్వరి, యాకలక్ష్మి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

రక్షణ కల్పించి న్యాయం చేయాలి 

తన భూమి వద్దకు రాకుండా బెదిరిస్తున్న వారి నుంచి రక్షణ కల్పించాలని చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన అంధురాలు ఎరుకల అనసూర్య కోరారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. వంశపారపర్యంగా భర్త వీరయ్యకు వచ్చిన భూమిలోకి అతడి అన్న రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-07-27T05:47:26+05:30 IST