ఆహారాన్ని వృథా చేయవద్దు

ABN , First Publish Date - 2022-06-21T06:19:34+05:30 IST

కుటుంబాల్లో జరిగే వేడుకల్లో పాల్గొన్న బంధు మిత్రులకు విందు ఏర్పాటుచేయడం ఒక ఆచారం. నేడు జరుగుతున్న వేడుకల్లో వచ్చిన అతిథుల మెప్పు...

ఆహారాన్ని వృథా చేయవద్దు

కుటుంబాల్లో జరిగే వేడుకల్లో పాల్గొన్న బంధు మిత్రులకు విందు ఏర్పాటుచేయడం ఒక ఆచారం. నేడు జరుగుతున్న వేడుకల్లో వచ్చిన అతిథుల మెప్పు, పొగడ్తల కోసం అనేక రకాల పదార్థాలను వండిస్తున్నారు. ఇన్ని పదార్థాల్లో తినేది పిడికెడు, పారేసిది తక్కెడు. ఒకప్పుడు అతిథులకు పీటలు వేసి విస్తరాకుల్లో ఎంత అవసరమో అంతే వడ్డించేవారు. దీనివల్ల ఆహార పదార్థాలు దుర్వినియోగం కాలేదు. నేటి వేడుకల్లో ‘బఫె’ పద్ధతిలో నిలబడి ఎవరికి వారు ప్లేట్లలో వడ్డించుకోవడంతో దుర్వినియోగం పెరుగుతోంది. ఎక్కువ మోతాదులో ఆహారం ఉంచుకోవడం, తినగా మిగిలిదంతా చెత్తబుట్టలో వేయడంతో శ్రమ, సొమ్ము మట్టిపాలవుతున్నాయి. పారవేసిన ప్రతి మెతుకులో పండించే రైతన్న కష్టం దాగి ఉంది. ఆహారం దుర్వినియోగం కాకుండా చూడాలి. ఒకవేళ ఆహారం మిగిలిపోతే బిచ్చగాళ్లకు, నిరుపేదలకు అందించాలి. వేడుకల్లో మిగిలిన ఆహారపదార్థాలు సేకరించి పేదలకు పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలకు ఫోన్ చేసినా చాలు వారు వాటిని సద్వినియోగపరుస్తారు.

ఆళవందార్ వేణుమాధవ్

Updated Date - 2022-06-21T06:19:34+05:30 IST