how sibling rivalry can take an ugly turn: తోబుట్టువులతో ఇలా మసులుకుంటున్నారా?

ABN , First Publish Date - 2022-09-09T13:47:51+05:30 IST

తోబుట్టువులు తరచుగా వేధింపులకు గురికావడం వల్ల పిల్లలు పెద్దయ్యాకా డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి.

how sibling rivalry can take an ugly turn: తోబుట్టువులతో ఇలా మసులుకుంటున్నారా?

తోబుట్టువులన్నాకా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరిని ఒకరు నిందించుకోవడం అనేవి సాధారణంగా జరిగే విషయాలే. ఇప్పుడు పెద్దగా తల్లితండ్రులకు సమస్యలు కాకపోవచ్చు కానీ.. ఇవే క్రమంగా పెరిగేకొద్దీ పెద్ద సమస్యలుగా మారవచ్చు. ఇలా తోబుట్టువులు తరచుగా వేధింపులకు గురికావడం వల్ల పిల్లలు పెద్దయ్యాకా డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. 


12 సంవత్సరాల వయస్సు గల 7000 మంది పిల్లలను పరిశీలిస్తే తోబుట్టువు బాధ కలిగించే మాటలు మాట్లాడటం, కొట్టడం, విమర్శించడం, అబద్దాలు చెప్పడం వంటివి జరుగుతున్నాయట.

అబ్బాయిల కంటే అమ్మాయిలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలలో తోబుట్టువుల బెదిరింపులకు గురయ్యే అమ్మాయిలు కొంచెం ఎక్కువగా ఉంటారు. ఈ వేధింపులు వీళ్ళకు ఎనిమిదేళ్ళ వయసు నుంచే మొదలవుతున్నాయని తేల్చారు. 


తోబుట్టువుల వాదనలలో అసూయ ప్రధాన కారణం. పిల్లలు తలితండ్రుల శ్రద్థ, ఆప్యాయత కోసం పోటీ పడుతుంటారు.  పిల్లల పట్ల కాస్త ఎక్కువగా ప్రేమను చూపించండి సమస్య తీరిపోతుంది. ఇద్దరినీ సమాన దృష్టితో చూడండి. 


వీళ్ల మధ్య టీమ్ వర్క్ అవసరం..

ఇద్దరి మధ్యా రాజీ కావాలి కనుక టీమ్ వర్క్ ప్లాన్ చేయండి. ఇది సహాయం చేసే గుణాన్ని పెంచుతుంది. 


కొట్టుకుంటున్నారా? వదిలేయండి.

పిల్లలు బాగా దెబ్బలాడుకుంటూ.. గొడవతీర్చమని రాజీకి మీ దగ్గరకు వస్తే మాత్రం గొడవ తీర్చేయకండి. ఆ బాధ్యతను వాళ్లకే వదిలేయండి. వారి మధ్య గొడవలను వాళ్ళే పరిష్కరించుకునే వీలు ఇవ్వాలి. పిల్లల మధ్య ఈ కీచులాటలు మామూలేనని వదిలేయకుండా వాళ్ళు మరీ సృతి మించి గొడవ పడుతున్నప్పుడు ఒక ఫోటో, లేదా వీడియో తీసి నెమ్మదిగా వాళ్ళకే చూపించండి. వాళ్ళ మధ్య గొడవలో ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలియజెప్పండి. 


రాజీలు చేసి వాళ్ళ మధ్య కీచులాటలు మళ్ళీ మళ్ళీ పెరిగేట్టు చేయకండి. వాళ్ళతో పడుకునే ముందు తలితండ్రులు సమయాన్ని గడపడం వల్ల రోజులో పిల్లలు చేసిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పిల్లలు ఏం చెపుతున్నారు అనేది వినండి. వాటికి బదులు చెప్పండి. 

Updated Date - 2022-09-09T13:47:51+05:30 IST