ఆరో వేలు అవసరమా?

ABN , First Publish Date - 2020-04-08T05:37:55+05:30 IST

రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను సాధించకపోగా అనవసర వివాదాలకు, సమస్యలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇప్పుడు ఈ వలంటీర్లు అందిస్తున్న...

ఆరో వేలు అవసరమా?

రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను సాధించకపోగా అనవసర వివాదాలకు, సమస్యలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇప్పుడు ఈ వలంటీర్లు అందిస్తున్న సేవలు కూడ నామ మాత్రమే! ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. సిబ్బందికి వేతనాలు చెల్లించటమే చాలా కష్టంగా ఉంది. ఆదాయం పూర్తిగా పడిపోయింది. అప్పు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో వలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేయటం సముచితంగా ఉంటుంది. పౌర సేవలకు గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వలంటీర్లతో రాజకీయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఇక ఎటువంటి భేషజాలకు పోకుండా ఇలాంటి ఆరో వేలు వ్యవస్థలకు తెర దించటం శ్రేయస్కరం! 

గరిమెళ్ళ రామకృష్ణ

Updated Date - 2020-04-08T05:37:55+05:30 IST