జీమెయిల్‌ నిండితే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2021-03-20T05:49:39+05:30 IST

ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో 15 జిబి వరకు ఉచిత స్పేస్‌కు అనుమతి ఉంది. ఒకప్పుడు అది సరిపోయేది. తరువాత కాలంలో ఫొటోస్‌ లింకింగ్‌ ఆప్షన్‌తో గూగుల్‌ ఇచ్చే ఉచిత స్పేస్‌ ఏమూలకూ సరిపోవడం లేదు

జీమెయిల్‌ నిండితే ఇలా చేయండి!

ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో 15 జిబి వరకు ఉచిత స్పేస్‌కు అనుమతి ఉంది. ఒకప్పుడు అది సరిపోయేది. తరువాత కాలంలో ఫొటోస్‌ లింకింగ్‌ ఆప్షన్‌తో గూగుల్‌ ఇచ్చే ఉచిత స్పేస్‌ ఏమూలకూ సరిపోవడం లేదు. జీమెయిల్‌ నిండుకుంటే ఏమి చేయాలన్నది ఇప్పుడు వినియోగదారులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య. జీమెయిల్‌లో ఒక్కో వినియెగదారుడికి ఇస్తున్న 15 జిబి ఉచితం కిందే గూగుల్‌ ఫొటోస్‌, గూగుల్‌ డ్రైవ్‌కు తోడు గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, స్లయిడ్స్‌ వస్తాయి. అలా చూసుకున్నప్పుడు గూగుల్‌ ఎకోసిస్టమ్‌కు పూర్తిగా అలవడ్డ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. అనవసరమైన ఫైల్స్‌, ఫొటోలను తొలగించుకోవాల్సి ఉంటుంది.ఫ్రీ స్టోరేజ్‌ ఒక్కసారి అయిపోతే, ఇకపై మెయిల్స్‌ రావు. మెయిల్స్‌ పంపేందుకూ వీలుండదు. ఇక ఫైల్స్‌, ఇతర డాక్యుమెంట్లను పంపడమూ కుదరదు. కొత్తగా స్పేస్‌ను కొనుగోలు చేయాలి. అలా చేయడానికి కుదరదు అనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం ఒక్కటో తరుణోపాయం. అవేంటో చూద్దాం.

  • జీమెయిల్‌ అకౌంట్‌లో క్లట్టర్‌ను క్లీన్‌ చేసుకోవాలి. వినియోగదారుడు తనకు వచ్చే ఏయే ఫైల్స్‌ను చూస్తున్నాడన్నది ఈమెయిల్‌ సర్వర్‌ సదా పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని క్లట్టర్‌ ఫోల్డర్‌ తనకు తాను  తీసుకుంటుంది.  చూడనివే అందులో ఉన్నందున మొదట ఆ క్లట్టర్‌ ఫోల్డర్‌ను క్లీన్‌ చేసుకోవడం మంచిది.
  • ముఖ్యమైన ఈమెయిల్స్‌తో సమస్యే ఉండదు. ప్రమోషన్‌, సోషల్‌, స్పామ్‌ కింద బల్క్‌లో ఫైల్స్‌ ఉంటాయి. వీటిని తొలగించడానికి ఒక చిట్కా ఉంది. ఆ మూడింటిలో దేన్నైనా క్లిక్‌ చేసి డస్ట్‌బిన్‌పై హిట్‌ చేస్తే మొత్తం తొలగిపోతాయి. 
  • ప్రమోషనల్‌ మెసేజ్‌లు ఎక్కడనుంచి తరచూ వస్తున్నాయో చూడండి. వాటి మెయిల్‌ ఐడీని గుర్తించండి. దాన్ని కాపీ చేసి సెర్చ్‌బార్‌లో పేస్ట్‌ చేయండి. తరవాత డిలీట్‌ కొడితే చాలు అవన్నీ పోతాయి. క్లట్టర్‌లో క్లియర్‌ చేసేందుకు కూడా పై పద్ధతినే రిపీట్‌ చేయండి. 
  • మరో పద్ధతి కూడా ఉంది. ఎక్కువ సైజ్‌ ఉన్న ఫైల్స్‌ను సెర్చ్‌ ద్వారా గుర్తించండి. వాటిలో అనవసరమైనవి కూడా ఉంటాయి. వాటిని తెలుసుకుని డిలీట్‌ చేయండి. ఈ పద్ధతిలో ఎక్కువ స్పేస్‌ మిగులుతుంది.
  • ఈ పనంతా అయిన తరవాత ట్రాష్‌ వద్దకు వెళ్ళండి. అక్కడ ఉన్నవి అనవసరమైనవా కావా అన్నది మరొకసారి తేల్చుకుని రెండోసారి డిలీట్‌ చేయండి. దాంతో చాలా స్పేస్‌ మిగులుతుంది లేదా కలిసి వస్తుంది. 
  • డ్రైవ్‌ శానిటైజేషన్‌ ఇప్పుడు చేపట్టండి. కోటాగా ఉన్న 15 జిబిని ఒక్క ఈమెయిల్స్‌ మాత్రమే తినేయవు. డ్రైవ్‌ సైతం స్టోరేజ్‌కి హబ్‌. హైరిజల్యూషన్‌ ఫోటోలు, డాక్యుమెంట్లు ఇక్కడే ఉంటాయి. వీటిపైనా కన్నేయాలి. స్టోరేజ్‌ స్పేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిలీట్‌ ప్రక్రియ చేపట్టాలి. ఇందుకోసం గూగుల్‌ డ్రైవ్‌ను డెస్క్‌టాప్‌పైకి తీసుకుని స్టోరేజ్‌ బటన్‌ ఒత్తాలి. డిసెండింగ్‌ ఆర్డర్‌లో ఫైల్స్‌ను గుర్తించి, ఏవి ఉంచుకోవాలో కూడా నిర్ధారించుకుని, అక్కర్లేదు అనుకున్నవి ముందుగా తొలగించాలి.
  • డిలీట్‌ చేసిన ఫైల్స్‌ అన్నీ ట్రాష్‌లోకి చేరి 24 గంటల సేపు అక్కడే ఉంటాయి. ఫైనల్‌గా ఒక నిర్ధారణకు వచ్చి వాటిని ట్రాష్‌ నుంచి కూడా తొలగించుకోవాలి. అనవసరమైనవి తొలగించుకోవడం ఒక లాభం. స్పేస్‌ కలిసి రావడం మరో లాభం. రెండిందాలుగా ఈ ప్రక్రియ మేలు చేస్తుందన్నమాట.

Updated Date - 2021-03-20T05:49:39+05:30 IST