మచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే..

ABN , First Publish Date - 2022-07-23T17:16:44+05:30 IST

మొటిమలు తగ్గినా, వాటి తాలూకు మచ్చలు(Spots) చాలా కాలం చర్మం(skin) మీద మిగిలిపోతాయి

మచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే..

మొటిమలు తగ్గినా, వాటి తాలూకు మచ్చలు చాలా కాలం చర్మం(skin) మీద మిగిలిపోతాయి. దాంతో మేకప్‌(Makeup) వేసుకుంటున్నప్పుడు, వాటిని దాచడం మీదే దృష్టి పెట్టవలసి వస్తుంది. అందుకోసం ఈ మేకప్‌ చిట్కాలు(Tips) పాటించవచ్చు.


మాయిశ్చరైజర్‌తో: మొటిమల నుంచి వెలువడే సీబమ్‌ వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. కాబట్టి ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజర్‌ మేక్‌పకు ముందు అప్లై చేసుకోవాలి. దీంతో మొటిమల తాలూకు వాపు, ఎరుపు తగ్గుతాయి. 


ప్రైమర్‌తో: స్కిన్‌కూ, మేక్‌పకూ మధ్య పొరలా పనిచేసే ప్రైమర్‌ చర్మ రంథ్రాలు, మచ్చలు, డాగులను దాచేస్తుంది. అలాగే చర్మం జిడ్డుగా కనిపించకుండా అడ్డు పడుతుంది. నుదురు, ముక్కు, చెక్కిళ్లు, చుబుకం మీద ప్రైమర్‌ను అప్లై చేసుకుని, చర్మం మొత్తం పరుచుకునేలా రుద్దుకోవాలి.


కలర్‌ కరెక్ట్‌: నారింజ కలర్‌ కరెక్టర్‌ను ఉపయోగించి, చర్మంలో కలిసిపోయేలా బ్లెండ్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే, పాత మొటిమల మచ్చలు, కొత్త మొటిమల ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయి. కలర్‌ కరెక్టర్‌ దొరకకపోతే, నారింజ రంగు లిప్‌స్టిక్‌ను మచ్చల మీద అద్దుకుని, మేకప్‌ బ్రష్‌తో రుద్ది, వాటిని కనిపించకుండా చేయవచ్చు.


కన్‌సీలర్‌ తప్పనిసరి: స్కిన్‌ టోన్‌కు దగ్గరగా ఉండే కన్‌సీలర్‌తో మచ్చలను చర్మంలో కలిసేలా బ్లెండ్‌ చేయాలి. ఇందుకోసం కన్‌సీలర్‌ను వేళ్లతో తీసుకుని, మచ్చల మీద అద్ది, చర్మంలో కలిపేయాలి. 


మ్యాటి ఫౌండేషన్‌: ఈ ఫౌండేషన్‌ను ముఖమంతా అద్దుకుని, స్పాంజ్‌తో ముఖం మొత్తం పరుచుకోవాలి. ఇందుకోసం సున్నితంగా చర్మాన్ని స్పాంజితో అద్దుకోవాలే తప్ప, రుద్దుకోకూడదు. 


చివర్లో పౌడర్‌: మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండడం కోసం చివర్లో పౌడర్‌ వాడాలి. స్పాంజిని తడిపి, పిండేసి, పౌడర్‌లో అద్ది ముఖం మీద అద్దుకోవాలి. ఇలా చేస్తే, మేకప్‌ మీద గీతలు ఏర్పడకుండా ఉంటాయి. 

Updated Date - 2022-07-23T17:16:44+05:30 IST