ఏఎల్‌పురం జగనన్న కాలనీలో అక్రమ ఇళ్ల నిర్మాణాలపై ఫిర్యాదులు పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-06-28T05:39:27+05:30 IST

ఏఎల్‌పురం జగనన్న కాలనీలో అనుమతులు లేకుండా 12 మంది అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని గొలుగొండ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌ ప్రశ్నించారు.

ఏఎల్‌పురం జగనన్న కాలనీలో అక్రమ ఇళ్ల నిర్మాణాలపై ఫిర్యాదులు పట్టించుకోరా?
విలేఖర్లతో మాట్లాడుతున్న వేణుగోపాల్‌


అధికారులు స్పందించకపోతే ఆందోళన 

జడ్పీటీసీ మాజీసభ్యుడు తారకవేణుగోపాల్‌ 

కృష్ణాదేవిపేట, జూన్‌ 27: ఏఎల్‌పురం జగనన్న కాలనీలో అనుమతులు లేకుండా 12 మంది అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని గొలుగొండ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌ ప్రశ్నించారు. సోమవారం ఏఎల్‌పురంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఏఎల్‌పురంలో 175 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా.. అందులో 47 మంది అనర్హులని ఆర్డీవో గోవిందరావు, గొలుగొండ తహసీల్దార్‌ వెంకటేశ్వరావులకు ఫిర్యాదు చేశామన్నారు. జగనన్న కాలనీలో మిగిలిన ప్రభుత్వ స్థలాలను 12మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆక్రమించి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. అధికారులు వైసీపీ నాయకులతో లాలుచీ పడ్డారని ఆరోపించారు. వీటిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే గ్రామంలో పేదలకు టీడీపీ ఆధ్వర్యంలో మిగిలిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేస్తామని, ఇళ్ల నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుకోకూడదన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కక్ష సాధింపుపై ఖాళీగా ఉన్న అధికారులు ఇటువంటి అక్రమ కట్టడాలు తొలగించడానికి ఎందుకు విధులు నిర్వహించరని ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బొడ్డు జమీలు, చింతల నారాయణమూర్తినాయుడు పాల్గొన్నారు.   


Updated Date - 2022-06-28T05:39:27+05:30 IST