నిర్వాసితుల సమస్యలు పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2021-11-27T06:17:51+05:30 IST

దశాబ్ద కాలంగా సమస్యల నడుమ జీవిస్తున్నామని, కనీస వ సతులు కూడా లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ధేనువకొండ పునరావాస కాలనీవాసులు అధికారుల ఎదుట ఏ కరువు పెట్టారు.

నిర్వాసితుల సమస్యలు పట్టించుకోరా..?
స్థానికులతో మాట్లాడుతున్న ఎస్‌డీసీ ఉమాదేవి

గుండ్లకమ్మ పునరావాసకాలనీల్లో ఎస్‌డీసీ పర్యటన

సమస్యలను ఏకరువు పెట్టిన గ్రామస్థులు

కనీస వసతులు, శ్మశానాలు లేవని ఆవేదన 


అద్దంకి, నవంబరు 26 : దశాబ్ద కాలంగా సమస్యల నడుమ జీవిస్తున్నామని, కనీస వ సతులు కూడా లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ధేనువకొండ పునరావాస  కాలనీవాసులు అధికారుల ఎదుట ఏ కరువు పెట్టారు. మండలంలోని వేలమూరిపాడు సమీపంలో, కొంగపాడు సమీపంలో ఉన్న రెండు ధేనువకొండ పునరావాసకాలనీలను శుక్రవారం గుండ్లకమ్మ ప్రాజెక్టు డి ప్యూటీ కలెక్టర్‌ ఉమాదేవి పరిశీలించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శ్మశానస్థలం లేకపోవటంతో సు మారు 30 కి.మీ దూరంలో ఉన్న ముంపు గ్రామమైన ధేనువకొండకు మృతదేహాన్ని తీ సుకుపోయి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాల్సి వస్తుందని వాపోయారు.  వేలమూరిపాడు సమీపంలోని పునరావాసకాల నీ, కొంగపాడు సమీపంలోని బలరామకృష్ణాపురం పునరావాసకాలనీలలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు ఉన్నా మంచినీటి సరఫరా జరగక పోవటంతో అద్దంకి వెళ్లి మినరల్‌ వాటర్‌ తె చ్చుకోవాల్సి వస్తుందని కాలనీలవాసులు తెలిపారు. వీధిలైట్లు, రోడ్లు లేక రాత్రి సమయాలలో ఇబ్బంది పడుతున్నామని వివరించారు. దశాబ్ద కాలం క్రితం రెండు పునరావాస కాలనీలు ఏర్పడ్డా ఇంకా ప్రత్యేక కాలనీలుగా గజి ట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించకపోవటంతో ప్రతి పనికీ ధేనువకొండకు వెళ్ళాల్సి వస్తుందని సొ సైటీ అధ్యక్షుడు రామిరెడ్డి ఆదిరెడ్డి అధికారులకు వివరించారు. అదే సమయంలో ఇళ్ల స్థ లాల పట్టాలు రెవెన్యూ తరఫున కాకుండా ప్రాజెక్టు అధికారుల సంతకాలతో ఇవ్వడంతో బ్యాంక్‌ రుణాలు,  క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్‌డీసీ  ఉమాదే వి హామీ ఇచ్చారు. ఆమె వెంట తహసీల్దార్‌ ప్రభాకరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరావు, ఏఈ శివయ్య, సొసైటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-11-27T06:17:51+05:30 IST