జింక్‌ తింటున్నారా!

ABN , First Publish Date - 2021-05-01T05:42:32+05:30 IST

రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలలో జింక్‌ ముఖ్యమైనది. జింక్‌ లోపిస్తే రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. చురుకుదనం తగ్గిపోతుంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడే జింక్‌ వేటిల్లో ఎక్కువగా లభిస్తుందంటే...

చికెన్‌, గుడ్లలో జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. అయితే క్యాలరీలు ఎక్కువ ఉన్న వీటిని మోతాదుగా తినాలి. చికెన్‌, గుడ్లలోని  విటమిన్‌ బి12 కణాల పునరుద్ధరణలో సాయపడుతుంది. నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

డార్క్‌ చాక్లెట్లు తింటే జింక్‌ లభిస్తుంది. జింక్‌ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

లెగ్యూమ్‌ జాతి కూరగాయల్లో జింక్‌ ఎక్కువ. ఆరోగ్యాన్ని పెంచే ప్రొటీన్లు, విటమిన్లు అధిక పాళ్లలో దొరకుతాయి.

గుమ్మడి గింజలను ఓట్స్‌, స్మూతీలతో కలిపి తినాలి. వీటిలో జింక్‌తో పాటు ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, విటమిన్‌ కె, ఫొలేట్‌ ఉంటాయి.  వీటిని తరచూ తినడం వల్ల రక్తపోటు సమస్య తలెత్తదు. 

షెల్‌ఫిష్‌ తింటే అవసరమైన జింక్‌లో 50శాతం లభిస్తుంది. ఆల్చిప్పలో క్యాలరీలు తక్కువ. దీనిలోని సెలీనియం, విటమిన్‌ బి12 రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి.

Updated Date - 2021-05-01T05:42:32+05:30 IST