రష్యా దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నాయంటే...

ABN , First Publish Date - 2022-03-01T17:24:38+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా అణ్వాయుధ దాడులకు

రష్యా దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నాయంటే...

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా అణ్వాయుధ దాడులకు పాల్పడుతుందేమోననే భయాందోళన పెరుగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఆదివారం తన వ్యూహాత్మక దళాలను అత్యధిక అప్రమత్తతో ఉండాలని ఆదేశించడంతోపాటు, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం అణ్వాయుధ క్షిపణి దళాలను అత్యంత గరిష్ఠ స్థాయిలో యుద్ధ సన్నద్ధతతో ఉండాలని ఆదేశించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. 


స్టాక్‌హోంలోని SIPRI అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాల్లో రష్యా ఒకటి. ప్రపంచంలో అత్యధికంగా 6,255 న్యూక్లియర్ వార్‌హెడ్స్ రష్యా వద్ద ఉన్నాయి. అమెరికా వద్ద 5,550; చైనా వద్ద 350, ఫ్రాన్స్ వద్ద 290  ఉన్నాయి. 


అణ్వాయుధాలపై నిషేధం విధించాలంటూ ప్రచారం చేస్తున్న ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, 2020లో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ కోసం రష్యా 8 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 


అణ్వాయుధాలను నియంత్రించే అధికారం రష్యా రాజ్యాంగం ప్రకారం ఆ దేశాధ్యక్షునికి ఉంది. అణ్వాయుధాలను ఉపయోగించడానికి ఆదేశాలివ్వాలంటే రష్యా రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అనుమతి కూడా అవసరం. 


ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించడానికి రష్యా సాహసించకపోవచ్చునని పరిశీలకులు చెప్తున్నారు. 


Updated Date - 2022-03-01T17:24:38+05:30 IST