Kuwait కు వలస వెళ్లిన మనోళ్లు.. నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

Sep 21 2021 @ 14:48PM

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌కు ప్రతియేటా బయటి దేశాల నుంచి ఉపాధి నిమిత్తం చాలా మంది వలసవెళ్తుంటారు. వీరిలో భారతీయులే అధికం. అక్కడి అన్ని రంగాల్లో వలసదారులు ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బయటి దేశాల నుంచి కువైత్ వచ్చిన ప్రవాసులు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయమై ఆ దేశ మానవవనరుల శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 5లక్షల మది వలసదారులు నెలకు సగటున 60 కువైటీ దినార్ల(రూ.16వేలు) నుంచి 119 కువైటీ దినార్ల(రూ.29వేలు) వరకు సంపాదిస్తున్నట్లు తేలింది.


అలాగే మరో 3.24లక్షల మంది ప్రవాసులు 120 కేడీ(రూ.29,300) నుంచి 179 కేడీలు(రూ.43,787) సంపాదిస్తున్నారట. ఇంకో 1.46లక్షల మంది నివాసితులు మంత్లీ 189 కేడీ(రూ.46వేలు) నుంచి 239 కేడీల(రూ.58,456) వరకు సంపాదిస్తుంటే.. 96,500 మంది సాలరీలు 300 కేడీ(రూ.73వేలు) నుంచి 359 కేడీల(రూ.87వేలు) మధ్య ఉన్నట్లు తెలిసింది. అలాగే మరో 55వేల మంది వలసదారుల నెలవారీ జీతాలు 420 కేడీ(రూ.లక్షల 2వేలు) నుంచి 479 కేడీల(రూ.లక్ష 16వేలు) వరకు ఉంటే.. 2,31,800 మంది ప్రవాసులు 480 కేడీలకు(రూ లక్ష 17వేలు) పైగానే సాలరీలు పొందతున్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

భారత్ నుంచి Kuwait కు మరో రెండు కొత్త విమాన సర్వీసులు..

Kuwait లో భారీగా ప్రవాసుల అరెస్ట్.. గత వారం రోజుల్లో ఎంతమంది జైలుకు వెళ్లారంటే..

 

ఇలా కువైత్‌లో మొత్తం 2.92 మిలియన్ల మంది ప్రవాసులు ఉపాధి పొందుతున్నట్లు తేలింది. వీరిలో 1.7 మిలియన్ మంది ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటే.. 4,64,400 మంది ప్రభుత్వ రంగాల్లో ఉన్నట్లు తెలిసింది. మరో 7.44లక్షల మంది డొమెస్టిక్ సెక్టార్‌లో ఉన్నట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. ఇక వీరిలో 57 శాతం మంది ఆసియా వాసులు, 35 శాతం అరబ్ దేశాల వారు, 4శాతం గల్ఫ్ ప్రాంతీయులు, ఒక శాతం ఆఫ్రికా నుంచి ఉన్నట్లు వెల్లడైంది. 


ఈ సందర్భంగా మానవవనరుల శాఖ సర్వే నివేధిక అంతర్గత మంత్రిత్వ శాఖతో పాటు ఇతర విభాగాలకు  పలు సూచనలు చేసింది. వలసదారులు ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడ్డారో వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కోరింది. అలాగే రెసిడెన్సీ పర్మిట్స్ గడువు ముగిసిన వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది. గ్యాస్ స్టేషన్లు, షాపింగ్ సెంటర్స్, కార్ పార్కింగ్స్, ట్యాక్సీ డ్రైవర్స్, క్లీనింగ్ వర్కర్ సూపర్ వైజర్స్, ప్రభుత్వ కాంట్రాక్టులపై ఉన్న గార్డ్స్ తదితర వాటిలో ప్రవాసుల నియామకాలను తగ్గించి దేశంలోని యువతకు అవకాశం కల్పించాలని కోరింది. 

16 ఏళ్లకు పైబడిన కువైటీ విద్యార్థులకు పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ వర్క్ చేసుకోవడానికి అనుమతించాలని పేర్కొంది. ఇలా కువైటీలకు అవకాశాలను పెంచడం ద్వారా కువైత్ "జనాభా అసమతుల్యత" సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర శాఖలను మ్యాన్‌పవర్ అథారిటీ కోరింది. ఇదిలాఉంటే... కువైటైజేషన్‌లో భాగంగా కువైత్ చేపడుతున్న పలు కఠిన విధానాల వల్ల ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రవాసులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే సుమారు 56,300 మంది వలసదారులు కువైత్ నుంచి వెళ్లిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో కువైత్‌లో ప్రవాసుల సంఖ్య 31 లక్షలకు పడిపోయిన్నట్లు సమాచారం. 


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.