మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

జీబ్రా అనే పదం ఇటాలియన్‌, స్పానిష్‌ భాషలోంచి పుట్టింది. లాటిన్‌లో ‘జీబ్రా’ అంటే ‘వైల్డ్‌ హార్స్‌’ అని అర్థం. ముఖ్యంగా ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి గుర్రం కుటుంబానికి చెందినవే.

మీకు తెలుసా?

  • జీబ్రా అనే పదం ఇటాలియన్‌, స్పానిష్‌ భాషలోంచి పుట్టింది. లాటిన్‌లో ‘జీబ్రా’ అంటే ‘వైల్డ్‌ హార్స్‌’ అని అర్థం. ముఖ్యంగా ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి గుర్రం కుటుంబానికి చెందినవే. 
  • పుట్టిన గంటలోనే జీబ్రా పిల్ల పరిగెత్తగలదు.
  • గంటకు 68 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి.
  • శరీరంలోని మెలనిన్‌ వల్ల మనకు నల్లని జుట్టు, వెంట్రుకలు ఏర్పడుతాయి. అయితే జీబ్రా శరీరంలోని మెలనిన్‌ తెలుపు రంగులో కూడా ఉత్పత్తి కావటం వల్ల నలుపు, తెలుపు చారలు ఏర్పడతాయి.
  • గుంపులుగా తిరిగే ఈ జంతువుల కాళ్లు బలమైనవి. స్టామినా ఎక్కువ. గుంపుగానే శతృవులను మట్టికరిపించగలవు. 
  • వీటి దంతాలు పదునుగా ఉండటం వల్ల పచ్చిగడ్డిని సులువుగా తింటాయి. పండ్లు, ఆకులు, గింజలు తినే జీబ్రాలు తినటానికే ఎక్కువ సమయం కేటాయిస్తాయి.
  • వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆఫ్రికాలో ఒక దిక్కు నుంచి మరో దిక్కుకి జీబ్రాలు వలస వెళ్తుంటాయి. ఒకేసారి కొన్ని వేల సంఖ్యలో బయలుదేరుతాయి. 
  • 17వ శతాబ్దంలో రాణులకు గిఫ్టుగా జీబ్రాలను ఇచ్చేవారట. గుర్రం బండిలానే జీబ్రాలతో బండి కట్టేవారు యూరోపియన్లు. 
  • జీబ్రాలను మాంసంకోసం, వీటి చర్మంతో సోఫాలపై అలంకరించేవారు. వీటితో పాటు వాతావరణ కాలుష్యం, సివిల్‌ వార్స్‌.. లాంటి పలురకాల కారణాల వల్ల వీటిసంఖ్య  తగ్గిపోయింది. చివరికి ఇవి ఆఫ్రికాకే పరిమితయ్యాయి. 

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST