మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-09-17T08:13:39+05:30 IST

కాపీబోరాను వాటర్‌హగ్‌ అని కూడా పిలుస్తారు. ఇవి నీరు ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.

మీకు తెలుసా?

  • కాపీబోరాను వాటర్‌హగ్‌ అని కూడా పిలుస్తారు. 
  • ఇవి నీరు ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. నీళ్లంటే మహా ఇష్టం. వేగంగా ఈదటమే కాదు డైవ్‌ కొట్టడంలో ఎక్స్‌పర్ట్స్‌. 
  • నాలుగు అడుగుల పొడవు ఉంటాయి. 
  • చిన్న జంతువులు 28 కేజీల బరువు ఉంటే పెద్దవి 76 కేజీల బరువు వరకూ ఉంటాయి. 
  • చిన్న కాళ్లు, చిన్న చెవులు ఉంటాయి. జుట్టు తక్కువ ఉంటుంది. తోక ఉండదు.
  • వాటర్‌మెలన్‌, విత్తనాలు తినటం వీటికి ఇష్టం. 
  • అమెజాన్‌ నది ప్రవాహం దారింట కనపడుతుంటాయి. వెనిజుల నుంచి దక్షిణ అర్జెంటీనా వరకు ఇవి గుంపులుగా కనపడుతుంటాయి. ఒక చిలీలో తప్ప దక్షిణ అమెరికా అంతా ఇవి ఉంటాయి.
  • చలి ఉన్నా, వేడిగా ఉన్నా వీటి శరీరం తట్టుకుంటుంది. 
  • వీటి జీవనకాలం పది సంవత్సరాలు. అయితే ఏ కాపీబోరా నాలుగేళ్లకు మించి బతకదు. ఎందుకంటే నీళ్లలోకి పోయినపుడు చీతాలకో, ముసళ్లకో దొరికి వాటికి ఆహారం అవుతుంటాయి. సంవత్సర కాలంలో ఒక ఫిమేల్‌ కాపీబోరా ఎనిమిది పిల్లలను పెడుతుంది. కొన్ని దేశాల్లో వీటిని జూలో కూడా ఉంచుతారు.

Updated Date - 2022-09-17T08:13:39+05:30 IST