మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-09-19T06:04:13+05:30 IST

మెల్లగా నడిస్తే ‘నత్తనడకలా నడవకు’ అంటుంటాం. ప్రపంచంలోనే ఇంత నిదానంగా కదిలే జీవి మరొకటి లేదు.

మీకు తెలుసా?

మెల్లగా నడిస్తే ‘నత్తనడకలా నడవకు’ అంటుంటాం. ప్రపంచంలోనే ఇంత నిదానంగా కదిలే జీవి మరొకటి లేదు. సెకనుకు మి.మీ మాత్రమే పాకగలదు. 

వీటి శరీరం కింద జిగురు లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది.

దీని ఆధారంగానే బండరాళ్లమీద పడకుండా పైకి ఎక్కగలవు.

60 వేల రకాల నత్తలు భూమిమీద ఉన్నాయి. 

నత్తమీద ఉండే షెల్‌ గట్టిగా ఉంటుంది. ఇందుకు కారణం అది కాల్షియం కార్బొనేట్‌తో తయారవుతుంది. ఇది పొరలు పొరలుగా ఉంటుంది. నత్త పరిమాణం పెరిగే కొద్దీ షెల్స్‌ పరిమాణం కూడా పెరుగుతుంది.

వేడిగా ఉన్నా, చలిగా ఉన్నా ఈ షెల్స్‌లోపల దాక్కుంటాయి. 

ఇవి సుప్తావస్థలోకి వెళ్తాయి. కొన్ని గంటల నుంచి మూడేళ్ల వరకూ నిద్రపోతాయి. 

కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాస జరిపితే.. మరికొన్ని రకాల నత్తలు చేపల వలే మొప్పలతో శ్వాస తీసుకుని వదులుతాయి.

నత్తలు మూడు సంవత్సరాలనుంచి 7 సంవత్సరాల వరకూ జీవిస్తాయి.

పేపర్‌ గట్టిగా ఉండటానికి పేపర్‌ ఇండస్ర్టీలో షెల్‌ను వాడతారు. కాస్మొటిక్స్‌లోనూ వాడతారు.

Updated Date - 2022-09-19T06:04:13+05:30 IST