కార్లు, బైక్‌ల టైర్లు, స్తంభాల మీదే.. శునకాలు ఎప్పుడూ మూత్ర విసర్జన చేస్తుండటం వెనుక అసలు కారణాలు ఇవా..!?

ABN , First Publish Date - 2022-05-25T21:49:04+05:30 IST

కుక్కలు విశ్వాసానికి మారు పేరు. అందుకే ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో అయితే కుక్కలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి..

కార్లు, బైక్‌ల టైర్లు, స్తంభాల మీదే.. శునకాలు ఎప్పుడూ మూత్ర విసర్జన చేస్తుండటం వెనుక అసలు కారణాలు ఇవా..!?

కుక్కలు విశ్వాసానికి మారు పేరు. అందుకే ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో అయితే కుక్కలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కొందరైతే వివిధ జాతులకు చెందిన కుక్కలను లక్షలు ఖర్చు చేసి మరీ కొంటుంటారు. ఇక వాటి పెంపకం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇంట్లో సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. కుక్కల విషయంలో చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. కార్లు, బైకు టైర్లు, స్తంభాల మీదే కుక్కలు ఎందుకు మాత్ర విసర్జన చేస్తాయనేదే ఆ డౌట్. అయితే దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలీదు. ఇంతకీ ఆ కారణాలు ఏంటంటే...


1. శునకాలు ఎక్కువగా కరెంటు స్తంభాలు, కారు, బైక్‌ టైర్లు వంటి వాటిపై ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. ఒకరకంగా ఇది ఇతర శునకాలకు సిగ్నల్ ఇవ్వడం వంటిదే అనుకోవచ్చు. ఏదైనా ఒక శునకం ఓ పని చేస్తే.. మరో శునకం కూడా అదే పని చేయడం అనేది చూస్తూనే ఉంటాం. అది జంతు లక్షణాల్లో ఒకటి. ఏదైనా ఒక శునకం టైర్లు, స్తంభాలపై మూత్ర విసర్జన చేస్తే.. వాటికి పట్టి ఉండే వాసన ఆధారంగా ఇతర శునకాలు కూడా అక్కడే మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి.

ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..


2. ఇక రెండో కారణం.. శునకాలు అడ్డంగా ఉండే వస్తువులు, ఆకారాల కంటే.. నిలువుగా కనిపించే వాటిపైనే మూత్రవిసర్జన చేయడానికి ఇష్టపడతాయి. కార్లు, బైక్‌ల టైర్ల కింది భాగాలు కానీ.. కరెంట్ స్తంభాల దిగువ భాగం కానీ శునకాల ముక్కుకు అందుబాటులో ఉంటాయి. అంతకుముందు శునకాలు వాటిపై మూత్ర విసర్జన చేస్తే వాటి వాసన ఆధారంగా.. మళ్లీ కొత్త శునకాలు అక్కడే మూత్ర విసర్జన చేస్తుంటాయి. అదే నేల మీద కానీ.. చెట్ల మీద కానీ శునకాలు మూత్ర విసర్జన చేస్తే.. ఎక్కువ సేపు ఆ వాసన ఉండదు. కాబట్టి ఎక్కువగా టైర్లు, పోల్స్ వంటి వాటి మీదే శునకాలు మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. మూత్రానికి సంబంధించిన వాసన వీటిపై ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అందుకే మూత్ర విసర్జన చేసే ముందు శునకాలు వాసన చూస్తూ ఉంటాయి.


3. ఇక మూడో కారణం.. శునకాలు రబ్బర్ టైర్ల వాసనను ఎక్కువగా ఇష్టపడటమే. అవును.. శునకాలకు రబ్బర్ టైర్ల వాసన నచ్చడం వల్లే.. అక్కడక్కడే తిరుగుతూ వాటి మీదే మూత్రాన్ని విసర్జిస్తాయి.

ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి..

Updated Date - 2022-05-25T21:49:04+05:30 IST