Mother Daughter Pilots: ఈ తల్లీకూతుళ్లిద్దరూ పైలట్లే కాదు.. అంతకు మించి.. ఇంతకీ వీరు సాధించిన రికార్డు ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-06T03:04:59+05:30 IST

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని చాలా మంది నిరూపిస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ తల్లీకూతుళ్లు (Mother and daughters) కూడా ఈ కోవకే...

Mother Daughter Pilots: ఈ తల్లీకూతుళ్లిద్దరూ పైలట్లే కాదు.. అంతకు మించి.. ఇంతకీ వీరు సాధించిన రికార్డు ఏంటో తెలుసా..

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని చాలా మంది నిరూపిస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ తల్లీకూతుళ్లు (Mother and daughters) కూడా ఈ కోవకే చెందుతారు. తాము తలచుకుంటే ఇంట్లోనే కాదు ఆకాశంలోనూ దూసుకుపోతామంటూ సవాల్ విసురుతున్నారు. తమ పిల్లలు తమ కంటే పైస్థాయిలో ఉండాలని ప్రతీ తల్లీతండ్రీ కోరుకుంటారు. కష్టపడైనా తమ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు చేయాలని కలలు కంటారు. సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌లో ఓ తల్లీ కూతుళ్లు పైలెట్లుగా (pilots) మారి ఆకాశంలో దూసుకుపోతున్నారు.


సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ (Southwest Airlines) తాజాగా తమ ఇన్‌స్టా అకౌంట్‌లో (Instagram account) ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. తల్లీ కూతుళ్ల ద్వయం.. పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని తెలిపింది. తన తల్లిలానే కూతురు కూడా పైలెట్‌గా శిక్షణ పొందింది. అంతేకాక వీరిద్దరూ ఒకే విమానాన్ని నడిపారు. సొంత కాళ్లపై నిలబడడమే కాదు.. తల్లితో పాటూ కలిసి విమానం నడిపినందుకు అభినందనలు అంటూ సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ పోస్ట్‌ చేసింది. అంతకముందు కెప్టెన్‌ టామ్‌, తన కుమారుడు మాట్‌తో కలిసి కాక్‌పిట్‌ షేర్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. అప్పుడు తండ్రి, కొడుకు పైలెట్లుగా ఒకే విమానంలో ప్రయాణించగా.. ఇప్పుడు తల్లీ కూతుళ్ల ద్వయం ఆకాశంలో దూసుకుపోవడం సౌత్‌వెస్ట్‌లోనే సాధ్యమంటూ పోస్టులో పేర్కొంది.

Live in relationship: సహజీవనం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారి.. నాలుగు నెలల తర్వాత.. సడన్‌గా ఊహించని పరిణామం..



Updated Date - 2022-08-06T03:04:59+05:30 IST