Kartik Aaryan నుంచి Tabu వరకు.. Bhool Bhulaiyaa 2 సినిమాలోని నటులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..

Published: Mon, 27 Jun 2022 15:19:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Kartik Aaryan నుంచి Tabu వరకు.. Bhool Bhulaiyaa 2 సినిమాలోని నటులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..

బాలీవుడ్‌లో స్వ శక్తితో ఎదిగిన నటుల్లో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. తాజాగా ‘భూల్ భూలయ్యా-2’(Bhool Bhulaiyaa 2)లో నటించారు. హారర్ కామెడీగా ఈ చిత్రం రూపొందింది. కియారా అడ్వాణీ (Kiara Advani)హీరోయిన్‌గా నటించారు. ‘టీ- సిరీస్’ నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఏప్రిల్ 20న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఐదువారాల్లో రూ. 180కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో నటించడానికి  కార్తిక్, కియారా భారీ పారితోషికాలను అందుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


కార్తిక్ ఆర్యన్ ‘భూల్ భూలయ్యా-2’ లో రూహ్ బాబా పాత్రలో కనిపించారు. చిత్రాన్ని మొత్తం తన భుజాల పైనే నడిపించారు. ఈ సినిమాలో నటించేందుకు ఆయన రూ. 15కోట్లను పారితోషికంగా తీసుకున్నారని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  కియారా అడ్వాణీ ఈ సినిమాలో రీత్ ఠాకూర్ పాత్రను పోషించారు. అందుకు గాను రూ. 4కోట్లను రెమ్యూనరేషన్ తీసుకున్నారట.  ‘భూల్ భూలయ్యా-2’ లో టబు, రాజ్ పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టబు ఈ సినిమాలో నటించేందుకు రూ. 2కోట్లను పారితోషికంగా అందుకున్నారట. సంజయ్ మిశ్రా కూడా రూ.1.25కోట్లను తీసుకున్నారని తెలుస్తోంది. ‘భూల్ భూలయ్యా-2’ హిట్ కావడంతో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్‌‌ను గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. విలాసవంతమైన కారు ‘మెక్ లారెన్-జీటీ’ ని బాహుమతిగా ఇచ్చారు. దీంతో కార్తిక్ ఉబ్బితబ్బిబయ్యారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు వచ్చే సారి ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్మాతను కోరారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...