వామ్మో.. Apple కంపెనీలో ఉద్యోగుల జీతాలు చూస్తే మైండ్‌బ్లాక్ అవడం ఖాయం.. ఒక్కొక్కరికి నెలకు ఎంత జీతమంటే..

ABN , First Publish Date - 2021-11-24T01:56:16+05:30 IST

Apple వంటి కంపెనీల్లో ఎలాంటి వేతనాలు ఉంటాయో.. తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మేరకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పారిన్ లేబర్ సర్టిఫికేషన్‌కు Apple సంస్థ అందజేసిన వివరాల ప్రకారం..

వామ్మో.. Apple కంపెనీలో ఉద్యోగుల జీతాలు చూస్తే మైండ్‌బ్లాక్ అవడం ఖాయం.. ఒక్కొక్కరికి నెలకు ఎంత జీతమంటే..

విదేశాల్లో ఉద్యోగాలంటేనే లక్షల్లో జీతం ఉంటుంది. ఇది అందరికీ తెలిసందే. అందుకే చాలామంది చదువు పూర్తవగానే విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు అక్కడే స్థిరపడిపోతుంటారు. అక్కడ ఏ కంపెనీలో అయినా మంచి జీతం ఉంటుంది. అయితే Apple వంటి కంపెనీల్లో ఎలాంటి వేతనాలు ఉంటాయో.. తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మేరకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పారిన్ లేబర్ సర్టిఫికేషన్‌కు Apple సంస్థ అందజేసిన వివరాల ప్రకారం..


Apple కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరుగాంచిన విషయం తెలిసిందే. వాటి ఉత్పత్తులకు కూడా ఎంతో డిమాండ్ ఉంటుంది. అందులో పని చేసే సిబ్బంది.. ట్రెండ్‌కు తగ్గట్టు  iPhoneలు, Macలను ఆధునికీకరిస్తుంటారు. అలాంటి కంపెనీలో పని చేసే సిబ్బంది వేతనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్‌కు.. 2021 మూడవ త్రైమాసికంలో సమర్పించిన నివేదికలో కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్‌లోని సుమారు వెయ్యి మంది ఉద్యోగుల జీతాల వివరాలు ఉన్నాయి.


ఉద్యోగుల హోదాను బట్టి వారి జీతం ఏడాదికి ఇలా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లకు $128,200 (సుమారు రూ.95 లక్షలు) నుంచి $220,000 (సుమారు రూ. 1.63 కోట్లు) మధ్య ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు $239,871 (సుమారు రూ. 1.78 కోట్లు) పొందుతారు, అయితే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు $250,000 (సుమారు రూ.1.86 కోట్లు) వరకు సంపాదిస్తారు. పరీక్షలు నిర్వహించే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజనీర్, అప్లికేషన్‌ల కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ల జీతాలు వరుసగా.. $137,275 (సుమారు రూ.1.02 కోట్లు), $150,000 (సుమారు రూ.1.11 కోట్లు), $125,000 (సుమారు రూ.93 లక్షలు)గా ఉంటుంది. అలాగే ఏఆర్, వీఆర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌కు $120,000 (సుమారు రూ.89 లక్షలు) నుంచి $246,000 (సుమారు రూ.1.83 కోట్లు) మధ్య ఉంటుంది. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ ఇంజనీర్‌కు $211,300 (సుమారు రూ.1.57 కోట్లు)ల జీతం ఉటుంది.

Updated Date - 2021-11-24T01:56:16+05:30 IST