Aryan Khan తల్లి Gauri Khan గురించి ఈ నిజాలు తెలుసా..? యాక్టర్‌గా భర్త Shah Rukh Khan ఫెయిల్ అవ్వాలని..

Oct 8 2021 @ 16:00PM

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అంటే బాలీవుడ్‌లో తెలియని వారెవరు ఉండరు. ఆమె అక్టోబర్ 8న జన్మించారు. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొవడంతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా ఆమెకు కూతురు సుహానా ఖాన్, రవీనా టండన్ మరెందరో బాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఈ సందర్భంగా గౌరీఖాన్ గురించి ఆసక్తికర విశేషాలు మీ కోసం..


కల్నల్ రమేశ్ చంద్ర చిబ్బార్, సవిత దపంతులకు ఢిల్లీలో గౌరీ ఖాన్ జన్మించారు. పాఠశాల విద్యను కూడా అక్కడే పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. తల్లి దుస్తుల వ్యాపారంలో ఉండటంతో టైలరింగ్ కూడా నేర్చుకున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును కూడా అభ్యసించారు. 

షారూఖ్ ఖాన్ ఒక పార్టీలో ఆమెకు 14ఏళ్లు ఉన్నప్పుడు చూశారు. కానీ, 4సంవత్సరాల అనంతరం ప్రపోజ్ చేశారు. అందరు ప్రేమికుల లాగానే లవ్ చేసుకున్న సమయంలో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక  సమయంలో ఆమె షారూఖ్‌కు చెప్పకుండగానే ఢిల్లీని వదిలి వెళ్లారు. షారూఖ్, గౌరీ 1991, అక్టోబర్ 25న పెళ్లి చేసుకున్నారు. 


షారూఖ్‌ను ఒక ఇంటర్వ్యూలో ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నారని అని హోస్ట్ అడిగారు. ‘‘ లవ్, లక్ ఎప్పుడైనా వచ్చి వెళ్లవచ్చు. గౌరీని పెళ్లి చేసుకోవడంతో నాకు రెండు దక్కాయి ’’ అని చెప్పారు. ఆరు ఏళ్ల అనంతరం వారికి ఆర్యన్ జన్మించాడు. వీరి కూతరు సుహానా ఖాన్ 2000వ సంవత్సరంలో జన్మించింది. షారూఖ్ బాలీవుడ్ కెరీర్ మీద ఆమెకు ఆసక్తి లేదు. అందువల్ల అతడి సినిమాలు ప్లాప్ అయితే తిరిగి ఢిల్లీకి రావొచ్చానుకుంది. సంవత్సరాలు గడిచే కొద్ది షారూఖ్‌కు సినిమాల మీద ఉన్న ఆసక్తి ఆమెకు అర్థమయింది. ఫలితంగా అతడి కెరీర్ కు అండదండలు అందించడం మొదలుపెట్టింది.


ఆ దంపతులు 2002లో సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్‌ను స్థాపించారు. ఆమె ఈ కంపెనీకి కో ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరు ముంబైలో మన్నత్ అనే ఇంటిని కూడా కొనుగోలు చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్‌ను హాబీగా ఎంచుకున్నారు. హృతిక్ రోషన్ మాజీ భార్య, మరో ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానే ఖాన్‌తో కలిసి ఇంటీరియన్ డిజైనింగ్ ప్రాజెక్టులను చేయడం మొదలు పెట్టారు. డిజైన్ సెల్ అనే స్టోర్‌ను కూడా వీరు లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ ఇంటీరియర్ డిజైనర్‌లతో కలిసి కూడా ఆమె పనిచేశారు. షారూఖ్, గౌరీ కలిసి ‘‘ ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ’’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ప్లిక్స్‌లో ప్రసారం అయింది.

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.