Fun facts about onion : మన వంటల్లో నిత్యం వాడే ఉల్లిపాయ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!

ABN , First Publish Date - 2022-10-02T15:01:03+05:30 IST

ప్రాన్స్ లో నవ వధూవరులకు బెడ్ రూమ్ లోకి వెళ్ళే ముందు ఉల్లిరసాన్ని తాగించేవారు.

Fun facts about onion : మన వంటల్లో నిత్యం వాడే ఉల్లిపాయ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!

పూర్వం నుంచి మన వంటకాల్లో భాగం అయిపోయిన ఉల్లిపాయ లేని కూరను కనీసం ఊహించలేం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడిని నిజం చేస్తూ ఉల్లి పాయ మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఉల్లిపాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయ తింటే చలవ చేసి కాస్త ఒంట్లోని వేడి పోయి రిలీఫ్ అవుతాం. ప్రతి దేశంలోనూ అక్కడ పండించే పంటల్లో ఉల్లిసాగు ప్రధానంగా ఉండి తీరుతుంది. 


ఉల్లి వెయ్యి సంవత్సరాలుగా వాడకంలో ఉన్నదని చరిత్ర చెపుతుంది. ఈ ఉల్లిపాయను ఆహారంగానే కాకుండా ఔషదంగా, సౌందర్య సాధనంగా కూడా వాడుతున్నారు. ఉల్లిరసంతో చుండ్రు నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఉల్లిపాయను నిత్యం ఆహారంలో తీసుకునేవారిలో కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది. అంతే కాదు ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించడంలో ముందుంటుంది. 


ప్రపంచంలో లెక్కలేనన్ని రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. పెర్ల్, ఎరుపు, తీపి, తెలుపు, పసుపు రకాలు ఉల్లిపాయలు చాలా సాధారణ సాగు రకాలు. అదేవిధంగా, ఉల్లిపాయల కుటుంబంలో మరో నాలుగు మొక్కలు ఉన్నాయి. ఇవి చివ్స్, షాలోట్స్, స్కాలియన్స్, లీక్స్ ,వెల్లుల్లి. ఇవన్నీ మన ఆహారంలో భాగంగా ఎప్పుడో మారిపోయాయి.


1. ఉల్లిసాగును ప్రపంచ వ్యాప్తంగా 5000 సంవత్సరాల క్రితమే ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ పంట పండించడం సులువు. అన్ని వాతావరణ పరిస్థితులకు ఇది అనుకూలమైన పంట.  


2. ఈజిప్షియన్లు ఉల్లిపాయలను పవిత్రంగా భావించేవారు. పురాతన కాలంలో వారు ఉల్లిపాయను ఆరాధకు, శాశ్వత జీవితానికి చిహ్నంగా చూసేవారు. ముఖ్యంగా దానిలోని పొరలను వైద్యం, పునరుజ్జీవనకు ఉదాహరణగా భావించేవారు.


3. అంతేకాదు ఈజిప్టు కళ, చిత్రలిపిలో కూడా ఉల్లిపాయ పవిత్రత చిత్రీకరించి ఉంది.


4. పురాతన గ్రీస్ ఒలింపిక్స్  క్రీడలను ప్రారంభించడానికి ముందు ఉల్లిపాయలను విస్తృతంగా ఉపయోగించడం సంప్రదాయంగా ఉంది.


5. అథ్లెట్లు ఆటలకు రావడానికి ముందు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను తినడానికి ఇచ్చేవారు.


6. కండరాలు వేడెక్కడానికి, ఉల్లిరసాన్ని తాగించేవారు. ఇది రక్తప్రసరణను పెంచుతుంది.


7. ఉల్లిపాయలో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. 


8. ఇందులోని క్వెర్సెటిన్ ఆరోగ్యకరమైన గుండెకు సహకరిస్తుంది.


9. ప్రతి సంవత్సరం 106 టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి. 


10. ఉల్లిపాయ ఉత్పత్తిలో చైనా 27 మిలియన్ టన్నులను సరఫరా చేస్తుంది.


11. లిబియన్లు ప్రతి సంవత్సరం 68.8 పౌండ్ల ఉల్లిపాయలు తింటారు. మన భారతీయులు కూడా ఇన్ని ఉల్లిపాయలను తినం.


12. ఉల్లిపాయ ఒక్కటే మనల్ని ఏడిపిస్తుంది. మరే ఇతర కూరగాయ కోసేటప్పుడు కన్నీళ్ళు రావు. ఇందులోని సిన్-ప్రోపనెథియల్ - ఎస్- ఆక్స్తెడ్ అనే రసాయనం వల్ల ఇలా కన్నీళ్ళు వస్తాయి. దానిని C3H6OS అని కూడా పిలుస్తారు.


13. ఉల్లిపాయలు సెక్స్ ఉద్రేకతను పెంచుతాయి. ఇందులో పురుషత్వాన్ని పెంచే శక్తి ఉంది. 


14. మధ్య యుగాలలో పుజారులు ఉల్లిపాయలు తింటే లిబిడో బూస్ట్ అవుతుందని నమ్మేవారు. 


15. ప్రాన్స్ లో నవ వధూవరులకు బెడ్ రూమ్ లోకి వెళ్ళే ముందు ఉల్లిరసాన్ని తాగించేవారు. 

Updated Date - 2022-10-02T15:01:03+05:30 IST