పిచ్చుక మృతితో గ్రామమంతా శోకసంద్రం.. దాని మీద ప్రేమతో ప్రజలంతా ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-10T01:43:02+05:30 IST

ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామస్తులంతా ఓ పిచ్చుకపై ఎనలేని ప్రేమ పెంచుకున్నారు. కన్న పిల్లలపై ఎలాంటి ప్రేమను చూపిస్తారో.. అచ్చం అలాంటి ప్రేమనే చూపించేవారు. అయితే అకస్మాత్తుగా ఓ రోజు ఆ పిచ్చుక చనిపోయింది. దీంతో...

పిచ్చుక మృతితో గ్రామమంతా శోకసంద్రం.. దాని మీద ప్రేమతో ప్రజలంతా ఏం చేశారంటే..

మనుషులు.. మనుషులు, జంతువులు.. జంతువుల మధ్య ప్రేమాభిమానాలు ఉండడం సహజమే. అలాగే కొన్ని జంతువులు, మనుషుల మధ్య కూడా అలాంటి విడదీయలేని బంధం ఉండడాన్ని అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామస్తులంతా ఓ పిచ్చుకపై ఎనలేని ప్రేమ పెంచుకున్నారు. కన్న పిల్లలపై ఎలాంటి ప్రేమను చూపిస్తారో.. అచ్చం అలాంటి ప్రేమనే చూపించేవారు. అయితే అకస్మాత్తుగా ఓ రోజు ఆ పిచ్చుక చనిపోయింది. దీంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. చివరకు వారంతా కలిసి ఏం చేశారో తెలుసుకుందాం... 


కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకా బసవ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామ పరిసరాల్లో పిచ్చుకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. గ్రామస్తులు కూడా వాటికి గింజలు వేస్తూ ఉంటారు. దీంతో అవన్నీ క్రమం తప్పకుండా రోజూ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో గ్రామస్తులకు ఓ పిచ్చుక బాగా దగ్గరైంది. ప్రతి ఇంటి ఆవరణలోకీ వెళ్లి సందడి చేసేది. ఇలా గ్రామస్తులందరికీ అది బాగా దగ్గరైంది. ఆ పిచ్చుక ఇంటి ఆవరణలోకి వచ్చిందంటే శుభ శూచకంగా భావించేవారు. అయితే జనవరి 26న ఆ పిచ్చుక అనూహ్యంగా చనిపోయింది.

భూమి మీద కాదు.. నీటి లోపల వేటాడే పులిని చూశారా.. చూస్తే వామ్మో ఇదేం పులిరా నాయనా అంటారు..


పిచ్చుక మరణవార్త విని గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. రోజూ అందరి ఇళ్ల వద్దకు వెళ్లే పిచ్చుక.. ఒక్కసారిగా దూరమవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దాని జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో  ప్రజలంతా కలిసి చనిపోయిన పిచ్చుకకు సమాధి కట్టించారు. శాస్త్రోక్తంగా పూజలు చేయడమే కాకుండా దశదిన కర్మ కూడా జరిపించారు. మళ్లీ బతికిరావాలని కోరుకుంటూ.. బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తప్పు చేస్తున్నావు.. పద్ధతి మార్చుకో.. అంటూ భర్త చెప్పింది విని ఆ భార్యలో మార్పు.. కానీ చివరకు షాకింగ్ సీన్..!

Updated Date - 2022-02-10T01:43:02+05:30 IST