
ఆంధ్రజ్యోతి(30-10-2021)
ఆర్థరైటి్‌సతో బాధపడే వారికి అద్భుతమైన ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మ జ్యూస్ తాగితే రక్త సరఫరా మెరుగుపడుతుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజూ ఒక దానిమ్మ పండు తీసుకుంటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు.
డయేరియా, ఐబీఎస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలగజేస్తుంది.
గుండెకు మంచిది. కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది.
స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
గ్రీన్‌టీతో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారంగా పనికొస్తుంది.
ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను రక్షిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
వాత, పిత్త, కఫాలను నియంత్రించడంలో తియ్యటి దానిమ్మ సమర్థంగా పనిచేస్తుంది. పుల్లటి దానిమ్మ వాత, కఫాలను బ్యాలెన్స్ చేసి పిత్తను పెరిగేలా చేస్తుందని ఆయుర్వేదనిపుణులు అంటున్నారు.