Girls Robbery: దుకాణంలోకి మూకుమ్మడిగా చొరబడిన యువతులు.. ఇంతకీ వారు చోరీ చేసిన వస్తువులేంటో తెలిస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-08-06T01:47:26+05:30 IST

ఆ యువతులు చూడ్డానికి చాలా హుందాగా కనిపించారు. అంతా కలిసి ఓ షోరూంలోకి వెళ్లారు. యువతులంతా డబ్బున్న వారిలా కనిపించడంతో దుకాణ సిబ్బంది వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు..

Girls Robbery: దుకాణంలోకి మూకుమ్మడిగా చొరబడిన యువతులు.. ఇంతకీ వారు చోరీ చేసిన వస్తువులేంటో తెలిస్తే అవాక్కవుతారు..

ఆ యువతులు చూడ్డానికి చాలా హుందాగా కనిపించారు. అంతా కలిసి ఓ షోరూంలోకి వెళ్లారు. యువతులంతా డబ్బున్న వారిలా కనిపించడంతో దుకాణ సిబ్బంది వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో షాపు మొత్తం కలియతిరిగిన వారు.. కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే తర్వాత షాపులో చాలా వస్తువులు కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. మొత్తం తనీఖీ చేసి చివరకు షాక్ అయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.


డెన్మార్క్‌లోని (Denmark) హోవ్‌లోని టెస్కో ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఓ పెద్ద నిత్యవసరాల దుకాణానికి (shop) కొందరు యువతులు మూకుమ్మడిగా వచ్చారు. వారంతా హుందాగా ఉండడంతో షాపు సిబ్బంది.. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంకేముందీ.. యువతులంతా కలిసి షాపు మొత్తం కలియతిరిగారు. ఈ మధ్యలో వారికి కావల్సిన వస్తువులను మొత్తం మూడో కంటికి తెలీయకుండా నొక్కేశారు. తర్వాత అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఏమీ కొనకుండానే వెళ్లడంతో వారిపై సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో షాపు మొత్తం తనిఖీ చేశారు.

Digital payments: ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా ఇంతమంది నష్టపోతున్నారా.. సర్వేలో షాకింగ్ వాస్తవాలు..


దుకాణంలో వందల పౌండ్ల విలువైన సిగరెట్లు (Cigarettes) తదితర వస్తువులు కనిపించకపోవడం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీని (CCTV footage) పరిశీలించారు. దీంతో యువతుల బాగోతం మొత్తం బయటపడింది. జూలై 18న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు. చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Live in relationship: సహజీవనం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారి.. నాలుగు నెలల తర్వాత.. సడన్‌గా ఊహించని పరిణామం..



Updated Date - 2022-08-06T01:47:26+05:30 IST