బాయ్స్ హాస్టల్లోకి ప్రియురాలిని తీసుకెళ్లాలి... అందుకోసం అతడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..
ABN , First Publish Date - 2022-02-06T03:24:13+05:30 IST
బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్‌ని, గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్‌ని అనుమతించరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ యువకుడు తన ప్రేయసిని ఎలాగైనా తన హాస్టల్‌కి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు...
కొందరు ప్రేమికులు ఒక్కోసారి చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. అందరి ముందు నవ్వులపాలవుతుంటారు. ప్రియురాలిని ఏకాంతంగా కలిసేందుకు ఎక్కడా చోటు లేదన్నట్లు ఓ యువకుడు విచిత్రమైన పని చేసి వార్తల్లో నిలిచాడు. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్‌ని, గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్‌ని అనుమతించరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ యువకుడు తన ప్రేయసిని ఎలాగైనా తన హాస్టల్‌కి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. చివరకు అతను చేసిన నిర్వాకం తెలుకుని అంతా అవాక్కయ్యారు.
కర్ణాటకలోని మణిపాల్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన ఇద్దరూ ఏకాంతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే తన హాస్టల్లోనే కలిసేలా మాట్లాడుకున్నారు. లోపలికి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు ఓ మహత్తరమైన ఐడియా వేశాడు. అందుకోసం ముందుగా ఓ ట్రాలీ బ్యాగ్ తెచ్చుకున్నాడు. తన ప్రియురాలిని అందులో కుక్కి.. దర్జాగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
పోలీసు వాహనంపై మనసు పారేసుకున్న వ్యక్తి.. తన కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేశాడంటే..
అయితే హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించాడు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయినా అతడిపై అనుమానం కలగడంతో సూట్‌కేస్ చెక్ చేసేందుకు ఓపెన్ చేశాడు. అందులో నుంచి అమ్మాయి బయటికి రావడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ విషయం చివరకు అధికారుల వరకు వెళ్లడంతో ఇద్దరినీ ఆయా హాస్టళ్ల నుంచి బయటికి పంపించారు.