Viral Video: ఇరుకైన సందులోకి వెళ్లేందుకు.. ఈ పాము ఏం చేసిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-02-25T02:28:16+05:30 IST

ఇటీవల జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సైతం వైరల్ అవుతోన్న క్రమంలో... ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇరుకైన సందులోకి వెళ్లేందుకు ఆ పాము శతవిధాలా ప్రయత్నిస్తుంది. చివరకు..

Viral Video: ఇరుకైన సందులోకి వెళ్లేందుకు.. ఈ పాము ఏం చేసిందో మీరే చూడండి..

కొన్ని సార్లు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సోషల్ మీడియా పుణ్యామా అని మనకు ప్రస్తుతం ప్రతి చిన్న ఘటననూ చూసే అవకాశం ఉంది. దీంతో కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇటీవల జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సైతం వైరల్ అవుతోన్న క్రమంలో... ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇరుకైన సందులోకి వెళ్లేందుకు ఆ పాము శతవిధాలా ప్రయత్నిస్తుంది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోన్న ‘స్నేక్ వీడియో’లో... ఓ పాము ఇరుకైన సందులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. సగ భాగం వరకు వెళ్లాక మధ్యలో ఇరుక్కుంటుంది. అంతకుమునుపే గుడ్లను మింగడం వల్ల సందులోకి వెళ్లేందుకు కష్టతరమవుతుంది. అయినా ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఉద్దేశంతో కడుపులోని గుడ్లను త్యాగం చేస్తుంది. ఒక్కొక్క గుడ్డునూ బయటికి కక్కేస్తుంది. దీంతో కొంచెం సందులోకి వెళ్లిపోతుంది. ఇలా మింగిన గుడ్లను మొత్తం బయటికి కక్కేస్తుంది. దీంతో సందులోకి పూర్తిగా వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

చావు అంచులదాకా వెళ్లిరావడం అంటే ఇదేనేమో.. అదృష్టం బాగుండి సరిపోయింది.. లేదంటేనా





Updated Date - 2022-02-25T02:28:16+05:30 IST