Royal Enfield Bike కంటే ఈ మామిడి పండ్ల ధరే ఎక్కువ.. ఒక్క కిలో ఎన్ని లక్షల రూపాయలంటే..

ABN , First Publish Date - 2022-07-23T01:26:12+05:30 IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield ) బైక్‌ కంటే మామిడి పండ్ల ధర ఎక్కువా.. అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది మాత్రం నిజం. కొన్ని తినుబండాల విలువ లక్షల్లో ఉండడం...

Royal Enfield Bike కంటే ఈ మామిడి పండ్ల ధరే ఎక్కువ.. ఒక్క కిలో ఎన్ని లక్షల రూపాయలంటే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్‌ కంటే మామిడి పండ్ల ధర ఎక్కువా.. అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది మాత్రం నిజం. కొన్ని తినుబండాల విలువ లక్షల్లో ఉండడం గతంలో చాలా చూశాం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మామిడి పండ్లకు కూడా అంత డిమాండ్ ఉంది మరి. అంతేకాదు.. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా పేరు గాంచాయి. ఇంతటి ఖరీదైన మామిడిని మనం దేశంలో కూడా పండిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎన్నో రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. ఇందుకు సంబధించిన వివరాల్లోకి వెళితే..


మామిడి పేరు వినగానే అందరికీ ముందుగా గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత ఖరీదు చేసే అరుదైన రకం మామిడిని సాగు చేస్తున్నారనే విషయం చాలా మందికి తెలీదు. ఈ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లా మామిడి పండ్ల సాగుకు ప్రసిద్ధి. ఈ జిల్లాలో సుమారు 50రకాల మామిడి పండ్లను సాగు చేస్తుంటారు. కోట నగర పరిధి.. కోట-జైపూర్ హైవేకు ఆనుకుని ఉన్న గిర్ధర్‌పురా గ్రామానికి చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు.. జపనీస్‌ రకానికి సంబంధించిన మియాజాకి అనే అరుదైన మామిడి పండ్లను సాగు చేస్తున్నాడు.

ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..


ఈ రకం మొక్కను ఇతడు.. ఊహించని విధంగా విదేశీయుడి ద్వారా అందుకున్నాడు. 11వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన శ్రీకిషన్‌కు.. మూడు మియాజాకి రకం మామిడి మొక్కలను, థాయిలాండ్‌కు చెందిన పరిచయస్తుడు బహుమతిగా అందించాడు. అనంతరం శ్రీకిషన్.. వాటిని తన నర్సరీలో నాటించాడు. మూడేళ్లలో వాటి నుంచి 200 నుంచి 300 గ్రాముల బరువు గల 10 పండ్లు వచ్చాయి. వాటిని కుటుంబ సభ్యులు, బంధువులకు అందించాడు. అంతా బాగున్నాయని చెప్పడంతో మరో మూడు మొక్కలకు అంటు కట్టాడు. ప్రస్తుతం ఒక్కో మొక్క రూ.2000 చొప్పున రూ.50మొక్కలకు ఆర్డర్లు పెట్టినట్లు శ్రీకిషన్ చెప్పాడు. మియాజాకి రకం మొక్కల సాగు చాల కష్టంతో కూడుకున్నదని శ్రీకిషన్ చెబుతున్నాడు. అందులోనూ ఎడారి ప్రాంతాల్లో వీటి సాగు మరింత కష్టతరమని తెలిపాడు. ఈ రకం సాగుకు ఎక్కువ సూర్యకాంతితో పాటూ నీరు అవసరమని పేర్కొన్నాడు.

CHILD LOVE: ఈ చిన్నారి ప్రేమకు కేంద్ర మంత్రులే ఫిదా అయ్యారు.. ఇంతకీ ఆ పాప చేసిన పని ఏంటంటే..


ఈ రకం మామిడి ఏడాదికి ఒకసారి దిగుబడి వస్తుంది. ఈ పండులో పోషక విలువలు చాలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తొక్కను కూడా సులభంగా తినేయొచ్చు. ఈ రకం పండ్లు జపాన్‌లో కిలో రూ.2.50లక్షల ధర పలుకుతున్నాయట. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కంటే ఖరీదన్నమాట. బన్స్వారా జిల్లాలో 2500 పైగా తోటల్లో వివిధ రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. ఒక్క బన్స్వారాలోనే 3,115 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 39,120 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుంటుంది. ఈ ప్రాంతంలో మియాజాకి రకమే కాకుండా ఇంకా మల్లికా, లాంగ్రా, అగ్రపాలి, కేసర్, దస్సేరి తదితర రకాల మామిడిని సాగు చేస్తుంటారు. ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం, నాబార్డు, వ్యవసాయ ఉద్యాన శాఖలు ఇక్కడి మామిడి సాగుపై దృష్టి సారిస్తున్నాయి.

Viral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..



Updated Date - 2022-07-23T01:26:12+05:30 IST