చాణక్య నీతి: మీకు త్వరగా విజయం కావాలా?.. ఈ లక్షణాలను ఈ క్షణం నుంచే అలవరచుకోండి.. అందరూ మిమ్మల్ని భేష్ అంటారు!

ABN , First Publish Date - 2022-01-06T12:17:04+05:30 IST

మీకు స్ఫూర్తినందిస్తూ, విజయాల బాటలో..

చాణక్య నీతి: మీకు త్వరగా విజయం కావాలా?.. ఈ లక్షణాలను ఈ క్షణం నుంచే అలవరచుకోండి.. అందరూ మిమ్మల్ని భేష్ అంటారు!

ప్రతి వ్యక్తిలో కొంత మంచి, మరికొంత చెడు ఉంటాయంటారు. సాధారణంగా మనిషి దృష్టి ప్రతికూల విషయాల వైపు మళ్లుతుంటుంది. అయితే ఎవరైనాసరే సానుకూల ఆలోచనలతో ఉంటూ, తన మంచితనాన్ని మెరుగుపరుచుకునేందుకు, చెడును తొలగించుకునేందుకు కృషి చేస్తే ఆ వ్యక్తి ఈ లోకంలో సాధించలేనిదేమీ ఉండదని ఆచార్య చాణక్య తెలిపారు.  

మీకు స్ఫూర్తినందిస్తూ, విజయాల బాటలో నడుస్తున్నవారు తమ జీవితంలో కొన్ని నియమాలను అనుసరిస్తున్నారని గ్రహించండి. వారు తమలోని నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆచార్య చాణక్య... మనిషి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి తెలియజేశారు. వీటిని అలవరుచుకుంటే మీ స్నేహితులతోపాటు శత్రువులు కూడా ఏమాత్రం వెనుకాడక మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. ఈ లక్షణాలు మనిషిని త్వరగా ప్రగతి పథంలోకి తీసుకెళ్తాయి. అలాంటివారు జీవితంలో ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా, మంచి పేరు సంపాదిస్తారు. ఆచార్య చాణక్య తెలిపిన విధంగా ప్రతీవారూ పెంపొందించుకోవాల్సిన ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


జ్ఞాన సముపార్జన

జ్ఞానం అనేది మనిషి నుంచి ఎవరూ దొంగిలించలేని సంపద. దానిని ఎంత ఎక్కువ సంపాదిస్తే, అది అంత గౌరవాన్ని అందిస్తుంది. జ్ఞానం అనేది ఎల్లవేళలా మీకు ఉపయోగపడుతుంది. దానిని మీరు ఎంత ఖర్చు చేసినా, అది ఎప్పటికీ తరగదు, దానికి బదులుగా మరింత పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు జ్ఞానాన్ని కూడగట్టుకోండి. అన్ని రకాల అంధకారాలను పారద్రోలే శక్తి జ్ఞానానికి ఉంది.

నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి

జ్ఞానంతో పాటు మనిషి తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీకు ఏ పనిలో ఎంత ప్రావీణ్యం ఉన్నా, నిరంతర సాధనతో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ఫలితంగా మీరు మీ రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఆ రంగంలో కీలకపాత్ర పోషిస్తారు. ఇలాంటివారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతారు. 


విలువలను వదులుకోవద్దు

మీరు జీవితంలో ఏ స్థానానికి చేరుకున్నా.. మీరు నమ్మిన విలువలను ఎప్పటికీ విస్మరించవద్దు. మీ విలువలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళతాయి. అప్పుడే మీరు అహంకారానికి దూరంగా ఉండగలుగుతారు. అటువంటి స్థితిలో, మీరు ఇతరులకు స్ఫూర్తిదాయకులుగా మారతారు. మీ చుట్టుపక్కలవారు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. 

Updated Date - 2022-01-06T12:17:04+05:30 IST