డాక్టర్స్‌ డే

ABN , First Publish Date - 2022-06-30T07:18:33+05:30 IST

నా చిన్నప్పుడు ఒక తమిళియన్‌ డాక్టర్‌ ఉండేవారు.

డాక్టర్స్‌ డే
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల దృశ్యం

సేవారంగంలో వైద్యానికి మించింది లేదు. రోగికి ఉపశమనం కలిగించడం, చికిత్సనందించడం, ప్రాణాపాయం నుంచి తప్పించడమే కాదు.. ఒక్కోసారి దేవుడిలా మరో జీవితాన్ని ప్రసాదించడం ఒక్క వైద్యునికే ఉన్న అవకాశం. అందుకే వైద్యోనారాయణో హరిః అంటారు. కొవిడ్‌ వేళ.. ప్రాణాలకు తెగించి మరీ అందించిన వైద్య సేవలతోనే చాలామంది బతికిబట్టకట్టారు. నేడు డాక్టర్స్‌ డే. వైద్య సేవారంగంలో విశేషమైన   సేవలందిస్తున్న కొందరు వైద్యుల గురించి తెలుసుకుందామా..

రోల్‌ మోడల్‌గా ఉండాలి

రాజమహేంద్రవరం అర్బన్‌ : నా చిన్నప్పుడు ఒక తమిళియన్‌ డాక్టర్‌ ఉండేవారు. ఆయన రోగిని టచ్‌ చేసేవారు కాదు. ఓపీ స్లిప్‌ చేతికి అడ్డుగా పెట్టి రోగి పల్స్‌ చూసేవారు. అది నాకు నచ్చేదికాదు. డాక్టర్‌, పేషెంట్‌ రిలేషన్‌షిప్‌ తండ్రీ కొడుకుల అనుబంధం కంటే ఎక్కువగా ఉండాలి. మా అమ్మ నన్ను డాక్టర్‌ చేయాలనే ఆలోచనతో ఉండేవారు. మేం నలుగురు పిల్లలం. నలుగురినీ చదివించే స్తోమత మా నాన్నగారికి లేదు. అయినా కష్టపడి, ఇష్టపడి డాక్టర్‌ చదివాను. ప్రభుత్వాసుపత్రుల్లో అప్పట్లో సిస్టమ్‌ బాగుండేదికాదు. విజయవాడలో మా ఇంటి పక్కన ఒక డాక్టర్‌ ఉండేవారు. చాలా సర్వీస్‌ మైండెడ్‌గా పనిచేసేవారు. ఆయన సేవా ప్రభావం నాపై కొంత ఉంది. డాక్టర్‌ వృత్తిలో రాణించాలంటే ఫ్యామిలీ సహకారం చాలా అవసరం. నేను సర్వీస్‌ చేస్తానంటే నా భార్య ఎప్పుడూ వెనక్కిలాగలేదు. తన ఎంకరేజ్‌మెంట్‌ ఉంది. నేను పిల్లలతో స్పెండ్‌ చేసేది ఆదివారం మాత్రమే. ప్రొఫెషన్‌లో పడిపోయిన తర్వాత ఫ్యామిలీ వంటివన్నీ గుర్తుకురావు. డాక్టర్‌ అనే వాడు ఇతరులకు రోల్‌ మోడల్‌గా ఉండాలి. సర్వీస్‌ మైండెడ్‌గా ఉండాలి. వృత్తిలోకి వచ్చిన మొదటి నుంచీ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఎర్నింగ్‌ కోసం ఆలోచిస్తూ ఉంటే ప్రొఫెషనల్‌గా ఉండలేరు.. పైకి ఎదగలేరు.

- డాక్టర్‌ టి.చంద్రశేఖర్‌, ఎండీ జనరల్‌,  రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి

సేవలకు చిరునామా ‘శ్రీలక్ష్మి’

అనపర్తి : వైద్యోనారాయణో హరిః నానుడిని నిజం చేసే డాక్టర్లు ఎందరో ఉన్నారు. అటువంటి వైద్యుల్లో అనపర్తికి చెందిన డాక్టర్‌ శ్రీలక్ష్మి కూడా ఒకరు. డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో 1963లో ఆమె డాక్టర్‌ పట్టా పొందారు. తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఎండీ, డీజీవో పట్టాలు సాధించారు. 1964లో ఐటీసీలో విధులు నిర్వహిస్తున్న జగన్నాథరావుతో వివాహం జరిగింది. భర్త ఉద్యోగ రీత్యా ఆమె 1968లో అనపర్తిలో స్థిరపడి ఇక్కడే క్లినిక్‌ ప్రారంభించారు. రోగులకు సేవలందించడంతోపాటు పేదలకు ఉచిత సేవలు అందిస్తూ పేరొందారు. అంతేకాకుండా గిరిజన సేవా సంఘ్‌ పేరుతో ఆమె ఒక సంస్థను  ప్రారంభించి అనేక గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ అడవి బిడ్డలకు వైద్య అం దిస్తూ వచ్చారు. వయస్సు మీద పడినా ఇప్పటికీ ఈ సేవలను కొనసాగిస్తుండడం విశేషం. రోగికి ప్రాణాపాయ స్థితి అన్న విషయం ఆమె చెవిన పడితే అర్ధరాత్రి అయినా ఏ వాహనం లేకపోతే సైకిల్‌పై కూర్చుని కూడా ఆమె రోగి వద్దకు చేరుకుని ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఆమె 14 అవార్డులను సాధించారు. అవార్డులంటే సంస్థలు గౌర వించి ఇచ్చేవికావని, రోగి ప్రాణాలు కాపాడిన తర్వాత వారి బంధువులు అం దించే కృతజ్ఞతలను మించిన అవార్డు మరోటి లేదంటారామె. భర్త జగన్నా థరావు ప్రోత్సాహంతోనే తాను ఇంతటి ఘనత సాధించానని, లేకుంటే అనప ర్తికి మాత్రమే పరిమితమయ్యే దానినని ఆమె అంటారు. ఆమె పూర్తి  స్థాయి లో 20 ఏళ్లపాటు గిరిజన గ్రామాల్లో తిరుగుతూ అడవి బిడ్డలకు వైద్యసేవలు  అందించడమే  కాకుండా తన సొంత ఖర్చులతో మందులను కొనుగోలు చేసు కుని వారికి అందించారు. డాక్టర్స్‌ డే సందర్భంగా ఆమెను కలిసిన ‘ఆంధ్రజ్యోతి’ తో మాట్లాడుతూ వైద్య వృత్తి అంటే సేవ చేయడమే అన్న భావంతోనే ఉం డాలని, నేటి తరం వైద్యుల్లో కూడా అనేకమంది సేవాతత్పరులు ఉన్నారని, ప్రస్తుత కాలాన్ని బట్టి వారు దూర ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించలేక పోతున్నారని, వైద్య శిబిరాల్లో సేవలు అందిస్తున్నారని ఆమె అన్నారు. 

తండ్రి బాటలోనే.. 

దివాన్‌చెరువు: వైద్యునికి ఓర్పు. సహనం ఉంటే రోగికి సగం రోగ లక్షణం తగ్గినట్టే. ప్రశాంతంగా వైద్యుడు చెప్పే నాలుగు మాటలు ఉపశమనమిస్తాయి. గ్రామీణ ప్రాంత రోగులకు వైద్య సేవలందిస్తూ మన్ననలు అందుకునే దివాన్‌చెరు వుకు చెందిన డాక్టర్‌ రాంబాబుకు అలా ఓపిగ్గా రోగులను పరీక్షించడంలో అందెవేసిన చెయ్యి. ఎంబీబీఎస్‌తోపాటు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించి ప్రత్యేక కోర్సు కూడా పూర్తిచేసిన కంభంపాటి వెంకట రామసుబ్రహ్మణ్యంని అంతా రాంబాబు డాక్టరుగానే పిలు స్తారు. వైద్యుడు అయిన ఆయన తండ్రి సాంబశివశాస్త్రి దివాన్‌చెరువులో 1964లో క్లినిక్‌ ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఆ క్లినిక్‌లోనే రాంబాబు డాక్టరు 1985లో వైద్య వృత్తిని చేపట్టారు. ప్రారంభంలో వైద్య పరీ క్షలకు పది రూపాయలు ఫీజుగా తీసుకునేవారు. తండ్రి ఇచ్చిన క్లినిక్‌ను ఆ తర్వాత డాక్టరు రాంబాబు ఎంతో అభివృద్ధి చేసి వంద ఫీజుగా తీసుకుంటున్నారు. అనవసరమైన పరీక్షలతో రోగులను పీడించే ప్రస్తుత కాలంలో అలాం టి ధోరణులేవీ ఇక్కడ కనిపించవు. రోగులకు అవసరమైన పరీక్షలు మాత్రమే చేయిస్తారు. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ రాంబాబు ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా తన తండ్రి సాంబశివశాస్త్రి ఆదర్శవంతమైన డాక్టరుగా దాదాపు 40 సంవత్సరాలపాటు ఈ ప్రాంతానికి వైద్య సేవలు అం దించారని, ఆయన బాటలోనే తన వైద్యవృత్తిని కొనసాగిస్తున్నానని చెప్పారు.

Updated Date - 2022-06-30T07:18:33+05:30 IST