కొవిడ్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-05-15T05:55:27+05:30 IST

లింగంగుంట్ల కొవిడ్‌ ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిం దబాబు కోరారు.

కొవిడ్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఆస్పత్రిలో బాధితుల బంధువులతో మాట్లాడుతున్న డాక్టర్‌ అరవిందబాబు

నరసరావుపేట, మే 14 : లింగంగుంట్ల కొవిడ్‌ ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిం దబాబు కోరారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. బాధితులకు అందుతు న్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని, బాధితు లకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రోగులకు సహాయకులుగా ఉన్నవారికి కూడా కొవిడ్‌ ప్రబలే అవకాశం ఉందన్నారు. రోగులను వైద్య సిబ్బంది సరిగా పట్టించుకోవడంలేదని తెలిపారు. రోగులు, వారి సహాయకులు వైద్య సిబ్బందిపై వైద్యం విషయంలో ఒత్తిడి పెంచకూడదని, రోగి అవసరాన్ని బట్టి వైద్యం అందిస్తారని చెప్పారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రోగుల వివరాలు, బెడ్ల ఖాళీలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డు ద్వారా ప్రకటించాలన్నారు. అక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌లు, మందులకు కొరత లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ ప్రక్రియను ప్రారంభించాలని అరవిందబాబు కోరారు. 

Updated Date - 2021-05-15T05:55:27+05:30 IST