ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యులేరీ?

ABN , First Publish Date - 2021-07-25T05:58:14+05:30 IST

ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో పలువురు వైద్యులు సమయ పాలన పాటించడం లేదని రోగులు వాపోతున్నారు.

ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యులేరీ?
చంటి పిల్లల నిపుణుడు బయటకు వెళ్లడంతో ఖాళీగా చాంబర్‌

 ఓపీలో ఉంటే ఉన్నట్టు..లేకపోతే రౌండ్స్‌కు వెళ్లినట్టని సిబ్బంది సమాధానం

  కానరాని సమయ పాలన 

 కొందరు మధ్యలో విధులకు డుమ్మా కొట్టి ‘ప్రైవేటు’ దారి! 

  కొవిడ్‌ కారణంగా ఓపీ త్వరగా ముగించి వెళ్లిపోతున్నారని ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ వివరణ

నర్సీపట్నం, జూలై 24 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో పలువురు వైద్యులు సమయ పాలన పాటించడం లేదని రోగులు వాపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధుల్లో ఉండాలి. మధ్యలో గంట భోజన విరామ సమయం. చాలామంది వైద్యులు ఆస్ప త్రికి రావడమే ఉదయం పది గంటలు దాటిన తర్వాత వస్తున్నారు. రౌండ్స్‌ పేరుతో గంట సమయం తీసుకుంటున్నారు. మధ్యాహ్నం అత్యవసర విభాగంలో డాక్టరు తప్ప, మిగిలిన డాక్టర్లు ఎవరూ ఉండడం లేదని పలువురు ఆరో పిస్తున్నారు. అదీకాక ఓపీ చూసే సమయంలో ఎముకలు, జనరల్‌ సర్జన్‌ ఆపరేషన్లు  పెట్టుకుంటున్నారని చెపుతు న్నారు. దీంతో ఓపీకి వచ్చే రోగులు గం టలతరబడి వేచి ఉండేందుకు ఇబ్బం దులు పడుతున్నారు. శనివారం మధ్యా హ్నం 12గంటలకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతి నిధి ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఎమర్జెన్సీ వార్డువద్ద డాక్టర్‌ లత ఓపీ చూస్తున్నారు. చర్మ వ్యాధులు, దంత వైద్యులు ఉన్నారు. మిగిలిన చాంబర్లన్నీ ఖాళీగా దర్శమిచ్చాయి. ఎముకల వైద్య నిపుణులు ఆపరేషన్‌కు వెళ్లారని సిబ్బంది చెప్పారు. ప్రత్యేక ఎస్‌ఎన్‌సీయూలో డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ బయటకు వెళ్లారని సిబ్బంది ద్వారా తెలిసింది. చంటి పిల్లల డాక్టర్లు ముగ్గురిలో ఒకరికి చింతపల్లి డిప్యూటేషన్‌ వేసినట్టు సూపరింటెండెంట్‌ చెప్పారు. మిగిలిన ఇద్దరు చంటి పిల్లల డాక్టర్లు ఆస్పత్రిలో లేరు. సిబ్బందిని అడిగితే రౌండ్స్‌కి వెళ్లారని తెలిపారు. ఇన్‌చార్జ్‌ సూపరింటిండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ మీటింగ్‌కి వెళ్లారని సిబ్బంది వివరించారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి  సెలవులో ఉన్నారు. 

ఇకపై అలా జరక్కుండా చూసుకుంటా

ఈ విషయంపై ఇన్‌చార్జ్‌ సూపరింటిండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ను ఫోన్‌లో  వివరణ కోరగా, కొవిడ్‌ కారణంగా ఓపీ త్వరగా ముగించుకొని వెళ్లిపోతున్నారని తెలిపారు. ఇకపై అలా జరక్కుండా చూసుకుంటానని చెప్పారు.

Updated Date - 2021-07-25T05:58:14+05:30 IST