రోడ్డు ప్రమాదంలో గాయపడిన డాక్టర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-27T04:27:31+05:30 IST

సింగరాయకొండ ప్రభుత్వ వైద్యశాలలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్న టి. తనూజబాయ్‌కి ఈ నెల 18న స్థానిక జాతీయ రహదారిపై కనుమళ్ల జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన డాక్టర్‌ మృతి
తనూజబాయ్‌(ఫైల్‌)

సింగరాయకొండ, అక్టోబరు 26 : స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్న టి. తనూజబాయ్‌కి ఈ నెల 18న స్థానిక జాతీయ రహదారిపై కనుమళ్ల జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. మృతురాలి భర్త కిరణ్‌కుమార్‌నాయక్‌ గతం లో టంగుటూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా పనిచేశారు. ఆమెకి ఇరువురు అబ్బాయిలు. ఒంగోలులో నివాసం ఉంటున్నారు. ఆమె మృతి పట్ల పీహెచ్‌సీలోని డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది సంతాపం తెలిపారు.


రేషన్‌ డీలరుపై 6ఏ కేసు నమోదు

దొనకొండ, అక్టోబరు 26 : మండలంలోని కొచ్చెర్లకోట గ్రామంలోని రేషన్‌షాపు నంబరు 0805019పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వస్తువుల నిల్వలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ-పోస్‌ మిషన్‌లో ఉన్న నిల్వ షాపులో స్టాక్‌కు 111 బస్తాల రేషన్‌ బియ్యం తేడా ఉన్నట్లు తేలింది. రేషన్‌షాపులో ఉన్న 28 బస్తాల బియ్యం, 174 ప్యాకెట్ల చెక్కర, 17 ప్యాకెట్లు కందిపప్పును సీజ్‌ చేశారు. వీఆర్వో ఏసయ్యకు ఆ సరుకు అప్పగించి డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో దర్శి, యర్రగొండపాలెం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్లు డేవిడ్‌రాజు, మస్తాన్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:27:31+05:30 IST