న్యూజెర్సీ నుంచి ఇండియాకు వచ్చిన డాక్టర్.. తిరిగి వెళ్లలేదు.. కారణం ఏంటంటే

ABN , First Publish Date - 2021-03-08T00:38:14+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు.. అమెరికా నుంచి వచ్చిన ఓ డాక్టర్ ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ స్వైమాన్ సింగ్ న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.

న్యూజెర్సీ నుంచి ఇండియాకు వచ్చిన డాక్టర్.. తిరిగి వెళ్లలేదు.. కారణం ఏంటంటే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు.. అమెరికా నుంచి వచ్చిన ఓ డాక్టర్ ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ స్వైమాన్ సింగ్ న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈయన ఏటా భారత్‌కు వచ్చి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి, కొద్ది రోజులకు తిరిగి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే గత ఏడాది చివరిలో ఇండియాకు వచ్చిన స్వైమాన్ సింగ్.. తిరిగి అమెరికా వెళ్లలేదు. ఢిల్లీ పరిసరాల్లో టిక్రీ సరిహద్దులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి.. మూడు నెలలుగా నిత్యం వేలాది మందికి ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. 



ఈ నేపథ్యంలో డాక్టర్ స్వైమాన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంత మంది వైద్యులతో కలిసి మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశా. కేవలం రైతులకే కాకుండా స్థానిక ప్రజలకు, పోలీసులకు, భద్రతా బలగాలకు వైద్యం అందిస్తున్నాం. సగటున రోజుకు 4వేల నుంచి 6వేల మందికి వైద్యం చేస్తున్నాం. రాత్రి వేళలో కూడా సేవలు అందుబాటులో ఉంటాయి’ అన్నారు. అంతేకాకుండా.. ‘నాకు డబ్బు సమస్య లేదు. దేవుడి దయ వల్ల నా కుటుంబం ఆర్థికంగా బాగానే ఉంది. ఇక్కడ ప్రజలు రోడ్లపై మరణిస్తున్నారు. జీవితంలో మన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించాల్సిన సమయం వస్తుంది. వైద్యునిగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నా కర్తవ్యం’ అని పేర్కొన్నారు. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా.. సుమారు 10వేల మందికి ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయడం.. మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్టు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ స్వైమాన్ సింగ్‌ సేవలను పలువురు గుర్తించి, ప్రశంసిస్తున్నారు. 


Updated Date - 2021-03-08T00:38:14+05:30 IST