Goa: చెకప్ పేరిట మహిళా రోగి ప్యాంట్ విప్పిన డాక్టర్ ఏం చేశాడంటే..

Sep 28 2021 @ 09:46AM

పనాజీ (గోవా): ఓ ప్రముఖ డాక్టర్ తన క్లినిక్‌లో మహిళా రోగిని చెకప్ చేస్తూ ఆమె ప్రైవేటు భాగాలను తాకడానికి ప్రయత్నించిన దారుణ ఘటన గోవా రాష్ట్రంలోని మవుసా పట్టణంలో వెలుగుచూసింది. మవుసా పట్టణంలో ప్రసిద్ధ ఆర్థోపెడిక్ సర్జన్ క్లినిక్‌కు లేడీ అటెండెంట్ లేకుండా ఓ మహిళా రోగి ఒంటరిగా వచ్చింది. తుంటి నొప్పితో డాక్టర్ వద్దకు వచ్చిన మహిళకు డాక్టర్ పడుకోబెట్టి ఆమె ప్యాంటు తీశాడు. అనంతరం తనిఖీ పేరిట డాక్టర్ మహిళా రోగి ప్రైవేటు భాగాలను తాకడానికి ప్రయత్నించాడు. దీంతో మహిళ డాక్టర్ చేతిని నెట్టివేసి క్లినిక్ బయటకు పరుగులు తీసింది.

 ఈ సంఘటన తర్వాత మనస్థాపానికి గురైన ఆ మహిళ కన్నీటిపర్యంతమై విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో భర్త క్లినిక్ కు వచ్చి డాక్టరును చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం బాధిత మహిళ కీచక డాక్టరుపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కీచక డాక్టరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ గజానన్ ప్రభుదేశాయ్ చెప్పారు. కాగా నిందితుడైన డాక్టర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.