లేగదూడల ప్రదర్శన

Published: Wed, 10 Aug 2022 21:55:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లేగదూడల ప్రదర్శనలేగదూడల ప్రదర్శనను తిలకిస్తున్న డాక్టర్‌ విజయ్‌కుమార్‌

కలిగిరి, ఆగస్టు 10: మండలంలోని కావలి ముస్తాపురం గ్రామంలో బుధవారం లేగదూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ గొల్లపల్లి విజయకుమార్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు లేగ దూడలను సంరక్షించుకొని మేలుజాతి పాడిపశువుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.  పశువుల వైద్య సేవల నిమిత్తం టోల్‌ఫ్రీ నెంబరు 1962ను ఉపయోగించుకోవాలని  సూచించారు. పశువైద్యాధికారి వీర హరికిరణ్‌ లేగ దూడల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి కొమ్మి కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.